AP SSC Result 2024 : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఈ రోజు విజయవాడలో ఉదయం 11 గంటలకు పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 3 వేల 473 కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30 వరకు పదవ తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 6 లక్షల 54 వేల మంది పరీక్ష రుసుము చెల్లించారు. వీరిలో 6 లక్షల 23 వేల మంది పరీక్షలకు హాజరయ్యారు. లక్షా రెండు వేల మంది ప్రైవేటుగా పరీక్ష రాశారు. ఫలితాలను www.eenadu.net, www.eenadupratibha.net, https://results.bse.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
రేపే పదో తరగతి ఫలితాలు విడుదల - ఇలా వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి - AP SSC Results 2024
Andhra Pradesh SSC Result : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి సమయంలో ప్రశ్నపత్రాల్లో స్వల్ప మార్పులు చేసింది. ప్రథమ, రెండో భాషా ప్రశ్నా పత్రాల్లో మార్పులు తీసుకొచ్చింది. తెలుగు, హిందీ, ఒడియా, ఉర్దూ, కన్నడ, తమిళ ప్రశ్నపత్రాల్లోనూ మార్పులు జరిగాయి. సెకండ్ లాంగ్వేజ్ హిందీ, తెలుగు ప్రశ్నపత్రాల్లోనూ మార్పులు తప్పలేదు. ఈ మేరకు మార్పులకు సంబంధించి బ్లూప్రింట్లను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వెయిటేజీతో పాటు మోడల్ పేపర్లను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు వెల్లడించింది. సైన్స్ ప్రశ్నపత్రం నమూనా కూడా త్వరలోనే వెబ్‌సైట్‌లో పెడతామని పేర్కొంది. ఆంగ్లం, గణితం, సోషల్ స్టడీస్ పేపర్లలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.