AP TET Hall Tickets Released : ఏపీ టెట్ 2024 పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. కొందరికి ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం వంటి పొరపాట్లు దొర్లాయి. దీంతో టెట్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించారు. హాల్‌టికెట్లలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించి పరీక్ష కేంద్రం వద్ద నామినల్ రోల్స్‌లో సరిచేయించుకోవచ్చని అభ్యర్థులకు సూచనలు చేశారు | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 23 September 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Mon Sep 23 2024- ఏపీ టెట్ హాల్‌టికెట్లు విడుదల - తప్పులు ఉంటే ఇలా చేయండి! - AP TET Hall Tickets Released
By Andhra Pradesh Live News Desk
Published : Sep 23, 2024, 7:00 AM IST
|Updated : Sep 23, 2024, 11:03 PM IST
ఏపీ టెట్ హాల్‌టికెట్లు విడుదల - తప్పులు ఉంటే ఇలా చేయండి! - AP TET Hall Tickets Released
రాష్ట్రంలో వరద బాధితులకు ఆర్థికసాయం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు - Flood Relief Package Increased AP
Flood Relief Package Increased in AP : వరద బాధితుల కోసం ఇదివరకూ ప్రకటించిన ఆర్థికసాయాన్ని మరింత పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనకు అనుగుణంగా వరద ముంపు బాధితులకు ఈ సాయం చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. | Read More
హైదరాబాద్‌లో జోరు వర్షం - రోడ్లన్నీ జలమయం - Hyderabad Rains Today
Heavy Rain in Hyderabad : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. వరద నీటితో రహదారులన్నీ జలమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై ఉన్న నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. | Read More
కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇస్తారు - ఆపై అందినకాడికి దోచేస్తారు - Police Arrest Theft Gang in Trains
Police Arrested Theft Gang in Trains : రైళ్లలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. దుండగులు చాకచక్యంగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా ప్రయాణికులకు కూల్‌డ్రింక్‌లో మత్తుందు కలిపి ఉన్న పానీయాన్ని ఇచ్చి వారి నుంచి అందినకాడికి దోచుకునే ముఠా గుట్టును ధర్మవరం రైల్వే పోలీసులు రట్టు చేశారు. | Read More
తిరుమల లడ్డూ వ్యవహారం - ఏఆర్ ఫుడ్స్‌కు కేంద్రం నోటీసులు - Tirupati Laddu Ghee Controversy
FSSAI Issues Notice to AR Dairy : తిరుమల లడ్డూపై వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లడ్డూకు నెయ్యిని సరఫరా చేసే ఏఆర్ ఫుడ్స్‌కు కేంద్రం నోటీసులు ఇచ్చింది. గత శుక్రవారం నోటీసులు జారీ చేసినట్లు భారత ఆహార భద్రత ప్రమాణాల విభాగాలు వెల్లడించాయి. | Read More
ధర్మవరంలో ఉద్రికత్త - బీజేపీ కార్యకర్తపై కారును ఎక్కించిన కేతిరెడ్డి వర్గీయులు - High Tension in Dharmavaram
Tension in Dharmavaram Sub Jail : ధర్మవరంలో బీజేపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ధర్మవరం సబ్‌జైలులో ఖైదీ పరామర్శకు కేతిరెడ్డి వచ్చారు. అప్పుడు అటువైపు వస్తున్న బీజేపీ నేత హరీశ్ వాహనశ్రేణికి అడ్డుగా కేతిరెడ్డి శ్రేణులు వాహనాలు అడ్డుగా పెట్టారు. ఈ విషయంపై మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు వారికి సర్దిచేప్పేందుకు యత్నిస్తున్నారు. | Read More
పాల రైతుల కష్టాన్ని విశాఖ డైరీ యాజమాన్యం దోపిడీ చేస్తోంది - అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటాం : అయ్యన్నపాత్రుడు - Speaker comments on visakha dairy
Speaker Ayyanna Patrudu Sensational Comments on Visakha Dairy : పాల రైతుల కష్టాన్ని విశాఖ డైరీ యాజమాన్యం అడ్డగోలుగా దోపిడీ చేస్తోందని ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటామని సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. పాల రైతులకు అన్యాయం చేసిన విశాఖ డైరీ ఛైర్మన్‌ను మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. | Read More
కర్నూలులో హైకోర్టు బెంచ్ - అమరావతిలో లా కాలేజీ - చంద్రబాబు కీలక నిర్ణయాలు - Chandrababu Review Meetings
Chandrababu on High Court Bench in kurnool : ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖలపై సమీక్షించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమని, ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని సీఎం వెల్లడించారు. అదేవిధంగా ముస్లింల పథకాలను పునర్ వ్యవస్థీకరించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. | Read More
లడ్డూ కల్తీ వ్యవహారంపై తిరుమలలో భూమన హంగామా - నోటీసులు ఇచ్చిన పోలీసులు - Bhumana Came to Tirumala
Bhumana Came to Tirumala to Take oath on Laddu Adulteration: లడ్డూ కల్తీపై ప్రమాణం చేస్తానంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో హంగామా చేశారు. ఆలయంలో రాజకీయ విమర్శలు చేసే ప్రయత్నం చేయబోగా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ పోలీసులు అడ్డుకున్నారు. కొండపైన రాజకీయ వ్యాఖ్యలు చేయవద్దని భూమనకు నోటీసులు ఇచ్చారు. | Read More
జగన్‌తో ఉండటం ఇష్టం లేకే చాలా మంది నేతలు పార్టీ మారుతున్నారు: కూటమి నేతలు - Idi Manchi Prabhutvam Program
Minister Anagani In Idi Manchi Prabhutvam Program in Bapatla : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న కారణంగా కూటమి నేతలు 'ఇది మంచి ప్రభుత్వం' పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేపడుతున్న సంక్షేమం, అభివృద్ది పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. | Read More
కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు - నిందితుల్లో పలువురు ఐపీఎస్‌లు - Kadambari Jethwani Case Updates
Kukkala Vidyasagar Remand Report : కాదంబరీ జెత్వానీ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రిపోర్ట్‌లో విద్యాసాగర్‌తో పాటు మరో ఐదుగురిని నిందితులుగా చేర్చారు. ఇందులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ముంబయి నటిని అక్రమంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. | Read More
కళాశాలకు కష్టాలు- ప్రవేశాల్లేక వెలవెల- వేతనాలందక ఉద్యోగుల ఆందోళన - NO Salaries for Sihmct Employees
NO Salaries for Sihmct Employees last 20 months in Tirupati : తిరుపతిలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ మూసివేత దిశగా అడుగులు వేస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలతో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దయనీయస్థితికి చేరుకుంది. ఉద్యోగులు విధులు బహిష్కరించి ఇనిస్టిట్యూట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. | Read More
టీటీడీ ప్రక్షాళన జరగాల్సిన సమయం ఆసన్నమైంది : మంత్రి నాదెండ్ల మనోహర్ - Nadendla Manohar on Tirumala Laddu
Nadendla Manohar on Tirumala Laddu : టీటీడీ విషయంలో వైఎస్సార్సీపీ సర్కార్ అహంకారంతో వ్యవహరించిందని మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు టీటీడీ టికెట్లు అమ్ముకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రసాదంపై పెట్టలేదని ఆరోపించారు. ఐదేళ్లుగా నాణ్యత లేని లడ్డూలు తయారుచేశారని నాదెండ్ల మండిపడ్డారు. | Read More
వంటింట్లో మంటలు - నూనె ధరల పెంపుతో సామాన్యులపై భారం వేసిన కేంద్రం - Increased cooking oil prices
Common People Worried about Huge Increase in Cooking Oil Prices: పోపు పెట్టాలన్నా, రుచికరంగా కూర వండాలన్నా, దోసెలు, గారెలు వేయాలన్నా వంట నూనె ఉండాల్సిందే. ఇది లేకుండా ఆహార పదార్థాల తయారీని ఊహించలేం.! ఇప్పుడా వంట నూనె ధరలు సలసల కాగుతున్నాయి. ఒక్కసారిగా కిలోపై 15 నుంచి 20 రూపాయల వరకు పెరిగింది. | Read More
వ్యాపారానికి పట్టణమే అవసరం లేదు - మంచి ఆలోచన ఉంటే చాలంటున్న యువతి - Eco Friendly Bags
Revathi Making Nature Friendly Bags in Srikakulam District : ఆర్థిక పరిస్థితుల కారణంగా చిన్నవయసులోనే వివాహం చేసుకుందా యువతి. ఇంట్లో ఖాళీగా ఉండేకంటే ఏదైనా వ్యాపారం చేస్తే మేలనుకుంది. పర్యావరణహితంగా ఆలోచించి నాన్ ఓవెన్ బ్యాగ్స్ తయారీ ప్రారంభించింది. ప్రజలకు, వ్యాపార సంస్థలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసి ఆర్డర్లు అందుకుంది. ఫలితంగా నేడు మరో పది మందికి ఉపాధి కల్పిస్తోన్న శ్రీకాకుళానికి చెందిన రేవతి విజయగాథ ఇది. | Read More
హాస్టల్ నుంచి 40 మంది విద్యార్థులు పరారీ - కారణాలు తెలిస్తే షాక్ ! - students escape from hostel
Students Escape from Hostel in Palnadu District: పల్నాడు జిల్లాలోని ఓ హాస్ట్‌ల్‌లో పదో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. పదో తరగతి విద్యార్థులంతా ఒక్క సారిగా హాస్టల్ నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. అందులో 27 మందిని సిబ్బంది పట్టుకోగా, మరో 40 మంది పాఠశాల ప్రహరీ గోడ దూకి సమీపంలోని కొండలపైకి వెళ్లారు. ఉపాధ్యాయుల సమాచారంతో, పరారైన విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. | Read More
కాంతిరాణా ముందస్తు బెయిల్ పిటిషన్ - రేపటి వరకు తొందరపాటు చర్యలు వద్దన్న హైకోర్టు - HC About Anticipatory Bail Petition
High Court Hearing on Kantirana's Anticipatory Bail Petition : వైఎస్సార్సీపీ నాయకుల కనుసన్నల్లో పని చేసి జత్వానీ కేసులో నింధితుల జాబితాలో పలువురు అధికారులు చేరిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కాంతిరాణా వేసిన పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ జరిపింది. | Read More
కోనసీమ కొబ్బరికి మంచి రోజులు - నెల రోజుల్లోనే రెట్టింపు ధర - Konaseema Coconut Prices Hike
Konaseema Coconut Prices Hike: కోనసీమ కొబ్బరికి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. కొబ్బరికాయల ధర భారీగా పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ధర రెట్టింపు అయ్యింది. మార్కెట్లో వెయ్యి కొబ్బరికాయల ధర 9 వేల రూపాయల నుంచి 18 వేలకు చేరింది | Read More
విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ నిర్మాణాలు - కొనసాగుతున్న కూల్చివేతలు - Neha Reddy Illegal Constructions
Neha Reddy Illegal Constructions Demolition: విశాఖలోని భీమునిపట్నం సాగరతీరంలో విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని ఇటీవలే హైకోర్టు మరోసారి సృష్టం చేసింది. రాజకీయ జోక్యంతో కూల్చివేత చర్యలను ఆపవద్దని సూచించడంతో, జీవీఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. | Read More
నెల్లూరు చెరువును కబ్జా చేసిన వైఎస్సార్సీపీ నాయకులు - చోద్యం చూస్తున్న అధికారులు - YSRCP Leaders Occupied Nellore Pond
YSRCP Leaders Occupied Nellore Pond : గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ నాయకులు నెల్లూరు చెరువు కబ్జా చేశారు. కాలువలు ఆక్రమించి బహుళ అంతస్తు భవనాలు నిర్మించారు. వారి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన కార్పొరేషన్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకుల ఆక్రమణలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. | Read More
ఏపీలోనూ బుల్డోజర్ల పంజా - కాకినాడలో ద్వారంపూడి అక్రమ నిర్మాణం కూల్చివేత - illegal construction demolish in AP
Illegal Construction Demolition in Kakinada: ఆంధ్రప్రదేశ్‌లోనూ అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లు దూసుకొస్తున్నాయి. తెలంగాణలో హైడ్రా పంజా విసురుతున్న విషయం తెలిసిందే. తాజాగా కాకినాడలో అక్రమ నిర్మాణాలను నగరపాలక సంస్థ కూల్చివేస్తోంది. | Read More
అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం - కావూరి హిల్స్‌లో షెడ్లు కూల్చివేత - Demolishing Illegal Constructions
HYDRA Demolishing Illegal Constructions In Kavuri Hills: తెలంగాణలో హైడ్రా దూకుడు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన అధికారులు తాజాగా మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో అక్రమ నిర్మాణాలను నేలకూల్చారు. | Read More
మూణ్నాళ్ల ముచ్చటగా పులివెందుల ల్యాబ్ - నిరుపయోగంగా ప్రజాధనం - Testing Lab in Pulivendula
Former CM Jagan Inauguration of Central Testing Laboratory in Pulivendula : వైఎస్సార్సీపీ సర్కారు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా పులివెందులలో ఏర్పాటు చేసినా పరిశోధనా కేంద్రం కనిపిస్తోంది. టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా గతేడాది హడావిడిగా జగన్ ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి పనులు జరగకపోవడంతో కోట్ల రూపాయల ప్రజాధనం నిరుపయోగంగా మారింది. | Read More
ముంబయి నటి కేసు - కుక్కల విద్యాసాగర్‌ను విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు - Mumbai Actress Case Updates
Mumbai Actress Case Updates: ముంబయి నటి కేసు నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు విజయవాడ తీసుకొచ్చారు. దేహ్రాదూన్ నుంచి రైలులో అర్ధరాత్రి విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు, ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో విద్యాసాగర్‌కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. | Read More
బంగాళాఖాతంలో అల్పపీడనం! - పలు జిల్లాలకు భారీ వర్ష సూచన - RAIN ALERT IN AP
Rain Alert in AP : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. | Read More
లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి - తిరుమలలో శాంతి హోమం - maha shanti homam in tirumala
Maha Shanti Homam in Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ప్రారంభమైంది. ఆలయంలోని యాగశాలలో అర్చకులు హోమం నిర్వహిస్తున్నారు. శాంతి హోమంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. | Read More
అల్లూరి జిల్లాలో విషాదం - జలపాతంలో ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థులు గల్లంతు - MBBS STUDENTS MISSING
Three MBBS Students Missing at Jalatarangini Waterfall :అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చిన ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థులు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోగా, స్థానికులు ఇద్దర్ని కాపాడారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. | Read More
తిరుమలలో నెయ్యి కల్తీపై సిట్ - నేడు శాంతి హోమం - Shanti Homam in Tirumala
Shanti Homam in Tirumala : తిరుమల నెయ్యి కల్తీపై సిట్‌తో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆగమ సలహామండలి నిర్ణయం మేరకు తిరుమలలో శాంతి హోమం, పంచగ్రవ్యప్రోక్షణ చేస్తారని చెప్పారు. దేవాదాయ శాఖ తరపున ఏపీలోని అన్ని ఆలయాల్లోనూ హోమాలు చేస్తామని వివరించారు. | Read More