AP High Court Verdict on 2018 Group-1 Mains:2018 గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష పేపర్లను రెండో సారి, మూడో సారి మూల్యాంకనం చేయటం చట్ట విరుద్దమని హైకోర్టు తీర్పు నిచ్చింది. మెయిన్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. మెయిన్స్ పరీక్షను తాజాగా నిర్వహించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2018 నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను మొదట డిజిటల్‌గా మూల్యాంకనం చేశారు. దీనిపై పలువురు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు.
వైసీపీఎస్సీగా ఏపీపీఎస్సీ - అయినవారికే పదవులు
హైకోర్టు ఆదేశాల ప్రకారం పేపర్లను మాన్యువల్‌గా(చేతితో దిద్దడం) మూల్యాంకనం చేశారు. ఈ క్రమంలో గతంలో అర్హత పొందిన కొందరు అభ్యర్ధులు అనర్హులుగా మారారు. దీంతో అర్హత కోల్పోయిన అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం మెయిన్స్ అభ్యర్ధుల జాబితాను రద్దు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. తాజాగా మెయిన్స్ పరీక్షను నిర్వహించాలని ఆదేశించింది. నోటిఫికేషన్ ఆధారంగా అర్హత సాధించిన వారందరికీ ప్రభుత్వం ఇప్పటికే పోస్టింగ్‌లు సైతం ఇచ్చింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇవ్వటంతో చర్చనీయాంశంగా మారింది.