AP HC on IPS Officers Bail Petitions : ముంబయి నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ, న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు, మరో ఇద్దరు పోలీస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి బదిలీ చేశామని పీపీ లక్ష్మీనారాయణ ధర్మాసనానికి తెలిపారు.
"ముంబయి సినీ నటి కేసు" - ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
AP HC on IPS Officers Bail Petitions (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 15, 2024, 3:45 PM IST
కౌంటర్ వేసేందుకు మరికొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని పీపీ లక్ష్మీనారాయణ కోరారు. అనంతరం పీపీ విజ్ఞప్తితో విచారణను హైకోర్టు ఈ నెల 23కి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్లను పరిష్కరించే వరకు పిటిషన్లను అరెస్టు చేయవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.