సాగర్ డ్యామ్ మరమ్మతులపై ఏపీ అభ్యంతరం - రంగంలోకి కేఆర్‌ఎంబీ AP Govt Objects on Nagarjuna Sagar Dam Repairs : నాగార్జునసాగర్ డ్యామ్‌కు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మరమ్మతులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏటా వర్షాకాలం ముందు డ్యామ్‌కు చేపట్టే మరమ్మతులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. దీనిపై రంగంలోకి దిగిన కేఆర్‌ఎంబీ, సాగర్ డ్యామ్‌పై చేపడుతున్న మరమ్మతులను కేఆర్ఎంబీ ఎస్‌ఈ వరలక్ష్మి, ఇతర అధికారులు పరిశీలిస్తున్నారు.
Nagarjuna Sagar Dam Issue :ప్రస్తుతం నాగార్జునసాగర్ నీటి నిర్వహణ కేఆర్ఎంబీ(KRMB) పరిధిలో ఉంది. కేవలం సాగర్‌కు అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు మాత్రమే రెండు రాష్ట్రాలకు బోర్డు అధికారమిచ్చింది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులో కంపోనెంట్స్ నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ శివనందన్ కుమార్ తెలంగాణ, ఏపీ ఈఎన్సీలతో చర్చించిన అనంతరం నీటి నిర్వహణను కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు ఒప్పుకున్నట్లు ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు తెలిపారు.
కాళేశ్వరం బ్యారేజీలను పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ బృందం
గతేడాది నాగార్జున సాగర్(Nagarjuna Sagar) వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులకు ఘర్ణణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు రోజు నవంబర్ 29న బుధవారం అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెద్దసంఖ్యలో సాగర్‌ను మోహరించారు. అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి కుడి కాలువ ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వివాదంపై కేంద్రం జోక్యం చేసుకుని ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించింది. నాగార్జునసాగర్ డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ పోలీసుల పటిష్ట నిఘా కొనసాగించాలని స్పష్టం చేసింది. బోర్డు అనుమతి తర్వాతే తెలంగాణ, ఏపీకి చెందిన ఇంజినీర్లు, అధికారులను డ్యాం సైట్ వద్దకు అనుమతించాలని కేంద్ర రిజర్వు బలగాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టుల అప్పగింతపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య వాడివేడి చర్చ జరిగింది. బీఆర్‌ఎస్ పాలనలోనే కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో బీఆర్ఎస్ విఫలమైందని, కేసీఆర్ పాపాలే ఇప్పుడు తెలంగాణకు శాపాలుగా మారాయని దుయ్యబట్టారు. 2015లోనే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్‌పై ప్రాజెక్టులను అప్పగించడానికి సంబంధించిన మాన్యువల్ డ్రాఫ్ట్‌కు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.'కృష్ణానదీ ప్రాజెక్టులపై వాస్తవాలు - కేసీఆర్ ప్రభుత్వ తప్పిదాలు' పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నోట్‌ను విడుదల చేసింది.
అన్నారం బ్యారేజీలో మళ్లీ సీపేజీలు - దిగువకు మళ్లీ నీటి విడుదల
రాష్ట్రానికి పెనుభారంగా మారనున్న కాళేశ్వం ప్రాజెక్ట్ - కాగ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు