AP Fibernet Corporation Legal Notice To RGV : సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో జలక్ ఇచ్చింది. వ్యూహం సినిమాకు రూల్స్‌కు విరుద్ధంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందటంపై ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నోటీస్ పంపించింది. వ్యూహం మూవీకి వ్యూస్ లేకున్నప్పటికీ ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్ల అనుచిత లబ్ధి పొందటంపై వర్మకు లీగల్ నోటీస్ ఇచ్చారు.
ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు నాటి ఫైబర్ నెట్ ఎండీతో సహా 5మందికి నోటీసులను జారీ చేశారు. రూల్స్‌కు విరుద్ధంగా లబ్ధి పొందినందుకు పదిహేను రోజుల్లోపు వడ్డీతో సహా మొత్తం కట్టాలని ఆదేశించారు.
అసలేం జరిగిందంటే :రాంగోపాల్ వర్మ సార్వత్రిక ఎలక్షన్స్‌కు ముందు తీసినటువంటి వ్యూహం మూవీకి రూ.2.15 కోట్లు ఫైబర్ నెట్‌తో ఒప్పందం చేసుకుని రూ.1.15 కోట్లను చెల్లించిందని జీవీ రెడ్డి తెలిపారు. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నదని వివరించారు. వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూస్ మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఈ లెక్కన ఒక్కో వ్యూస్‌కు రూ.11,000 చొప్పున చెల్లించినట్లుగా అయ్యిందన్నారు. దీనిపై వివరణ కోరుతూ లీగల్ నోటీసు జారీ చేశామని జీవీ రెడ్డి తెలిపారు.
ఆ పోస్టులు పెట్టినందుకు రాంగోపాల్ వర్మకు నోటీసులు - విచారణకు హాజరు కావాలన్న పోలీసులు
నన్ను అరెస్టు చేస్తే జైలుకెళ్తా - సినిమా స్టోరీలు రాసుకుంటా : రాంగోపాల్ వర్మ