AP Election Result in Joint Krishna District:రాష్ట్ర వ్యాప్తంగా కూటమి హవా కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతోంది. విజయవాడ సెంట్రల్ తొలి రౌండ్లలో తెలుగుదేశం అభ్యర్థి బొండా ఉమా మహేశ్వరరావు వైఎస్సార్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ రావుపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతోంది. మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ లెక్కింపు ఫలితాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎస్ తిరుపతిరావుపై గెలుపు దిశగా పయనిస్తున్నారు.
నందిగామ టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య వైఎస్సార్సీపీ అభ్యర్థి మొండితోక జగన్ మోహన్‌రావుపై ముందంజలో కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట తొలి రౌండ్ ముగిసేసరికి తెలుగుదేశం అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య వైఎస్సార్సీపీ అభ్యర్థి సామినేని ఉదయభానుపై ముందంజలో కొనసాగుతున్నారు. కృష్ణా జిల్లా, మోపిదేవి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
కౌంటింగ్ సందర్భంగా జగ్గయ్యపేటలో పోలీస్ పహార మధ్య బంధు వాతావరణం నెలకొంది ఎక్కడ ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పట్టుదితమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలోని నిమ్రా ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్ కౌంటింగ్ సరళిని పరిశీలించారు. టీడీపీ 161 స్థానాల్లో గెలపొందుతున్నామని విజయవాడ ఎంపి అభ్యర్థి చిన్ని తెలిపారు. వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని అన్నారు.