తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమల లడ్డూ అపవిత్రం - 11 రోజుల పాటు పవన్​ కల్యాణ్​ ప్రాయశ్చిత్త దీక్ష - Pawan Tweet on Tirupati Laddu - PAWAN TWEET ON TIRUPATI LADDU

Pawan Kalyan Emotional Tweet: తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీ పై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందన్నారు. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరని దుయ్యబట్టారు.

Pawan Kalyan Emotional Tweet
Pawan Kalyan Emotional Tweet (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2024, 10:32 PM IST

AP Deputy CM Pawan Kalyan Emotional Tweet : తిరుమల లడ్డూ అపవిత్రంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుకొండలవాడా క్షమించు అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ గత పాలకుల వికృత పోకడలతో అపవిత్రమైందన్నారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకమని పేర్కొన్నారు. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్న నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందేనని అన్నారు.

తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు వికలమైందని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందేనన్నారు. తన వంతుగా 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని తెలిపారు. సెప్టెంబర్ 22 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష ప్రారంబిస్తానని ప్రకటించారు.

పాపాన్ని ఆదిలోనే కనిపెట్టకపోవడం హైందవ జాతికే కళంకం : 11 రోజుల దీక్ష తర్వాత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటానని తెలిపారు. భక్తులు అమృతతుల్యంగా, పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని ఆరోపించారు. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరని వ్యాఖ్యానించారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకంగా అభివర్ణించారు.

దేవదేవుని పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటున్నట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపలేదంటే నాటి రాక్షస పాలకులకు భయపడి మౌనంగా ఉన్నారని అనిపిస్తోందన్నారు.

వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించిందని తెలిపారు. ఇప్పుడు ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైందని అన్నారు. ధర్మో రక్షతి రక్షితః అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్​లో ఆవేదనాభరిత పోస్ట్ పెట్టారు.

తిరుమల శ్రీవారి లడ్డూకే ఎందుకంత రుచి? - ఇలా తయారు చేస్తారు కాబట్టే ఆ స్పెషల్ టేస్ట్ - How to Make Tirumala Laddu Prasadam

టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి నాణ్యతా లోపం లేదు : ఏఆర్‌ డెయిరీ - AR Dairy on TTD Laddu Controversy

ABOUT THE AUTHOR

...view details