ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగియనున్న కోర్టు అనుమతి - 15 రోజుల తరువాత స్వదేశానికి సీఎం జగన్ - CM Jagan Return from Tour - CM JAGAN RETURN FROM TOUR

AP CM YS Jagan mohan Reddy Returns Tomorrow from London Tour: విదేశీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, భారతి దంపతులు ఇవాళ రాష్ట్రానికి బయలుదేరనున్నారు. ఇవాళ రాత్రి వారు లండన్ నుంచి తిరుగు పయనమవుతారు. రేపు ఉదయం 4.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు.

AP CM YS Jagan mohan Reddy Returns Tomorrow from London Tour
AP CM YS Jagan mohan Reddy Returns Tomorrow from London Tour (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 31, 2024, 11:55 AM IST

Updated : May 31, 2024, 12:16 PM IST

AP CM YS Jagan mohan Reddy Returns Tomorrow from London Tour : గత రెండు నెలలుగా రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారాలతో బిజీబిజీగా ఉన్నారు. ఈ వేసవి కాలంలో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో ఎన్నికల వేడి తారాస్థాయికి తీసుకెళ్లారు. క్షణం తీరికలేకుండా ప్రజలతో మమేకమయ్యారు. ఎట్టకేలకు ఈ నెల 13న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ముగియడంతో కాస్త కుదుట పడ్డారు. అభ్యర్థులు భవిష్యత్తు జూన్ 4న తెలియనుంది. ప్రస్తుతానికి పోలింగ్ ముగియటంతో రాజకీయ విశ్రాంతి తీసుకుంటున్నారు. కౌటింగ్ వరకు సమయం ఉండటంతో వివిధ పార్టీల అగ్రనేతలు వారి కుటుంబ సభ్యులతో గడిపేందుకు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే సీఎం జగన్ కుటుంబంతో గడిపేందుకు కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్లారు.

విదేశాలకు జగన్- ఎన్నికల ఫలితాల వరకూ అక్కడే! - Jagan abroad tour

15 రోజుల తరువాత స్వదేశానికి రానున్న సీఎం జగన్ : విదేశీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, భారతి దంపతులు ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ రాత్రి వారు లండన్ నుంచి తిరుగు పయనమవుతారు. రేపు ఉదయం 4.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. పోలింగ్ అనంతరం ఈ నెల 17 న సీఎం జగన్ కుటుంబంతో కలసి విదేశీ పర్యటనకు వెళ్లారు. లండన్ సహా ఫ్రాన్స్, స్విడ్జర్లాండ్​లో పర్యటించినట్లు తెసుస్తోంది. 15 రోజుల తర్వాత రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. రేపు తెల్లవారుజామున 4.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకోని అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్లనున్నారు.

వైఎస్ జగన్ మరో సారి ధీమా వ్యక్తం :మరి కొద్దిరోజుల్లో ఎన్నికల ఫలితం తేలనున్న పరిస్ధితుల్లో గెలుపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సారి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ తమ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుందని ఎక్స్ వేదికగా తెలిపారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఐదేళ్లు పూర్తైన సందర్బంగా స్పందించిన ముఖ్యమంత్రి ఓ సందేశం పంపారు. దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సీఎం తెలిపారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేశామని తెలిపారు. రానున్న రోజుల్లోనూ ఇదే విధంగా పరిపాలన సాగిస్తామన్నారు.

విదేశీ పర్యటనకు సీఎం జగన్​- వీడ్కోలు పలికిన పార్టీ నేతలు - Cm Jagan tour

Last Updated : May 31, 2024, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details