Defamation suit notice to Sakshi magazine:బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి (BJP state president Daggupati Purandeshwari ) సాక్షి పత్రికకు పరువు నష్టం దావా (Purandeshwari defamation suit on Sakshi News) నోటీసులు పంపారు. సంధ్య ఎక్స్‌పోర్ట్స్‌లో పురందేశ్వరి కుటుంబానికి భాగస్వామ్యం ఉందంటూ సాక్షి పత్రికలో వార్తలు రావడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సాక్షి పత్రిక యాజమన్యానికి రూ.20 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపించారు. ఆధారరహిత వార్తలు ప్రచురించి పరువు నష్టం కలిగించారన్న నోటీసులో పురందేశ్వరి పేర్కొన్నారు. సాక్షి పత్రిక యాజమాన్యానికి పురందేశ్వరి న్యాయవాది సతీష్ నోటీసులు ఇచ్చారు.
ఈ నెల 16వ తేదీన చైనా నౌక ద్వారా బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుంచి కంటైనర్ ‘డ్రైడ్ ఈస్ట్’ బ్యాగ్‌లతో విశాఖకు బయలుదేరినట్లు సీబీఐ అధికారుల గుర్తించారు. ఈ కంటైనర్ సంధ్యా ఆక్వా పేరుతో బుక్ అయింది. జర్మనీ పోర్టు మీదుగా వస్తున్న సమయంలో కంటైనర్‌ను స్క్రీనింగ్ చేశారు. ఇందులో మాదకద్రవ్యాలు ఉన్నట్లు అనుమానించారు. ఇంటర్‌పోల్ అప్రమత్తమై సమాచారం ఇవ్వడంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఇంటర్‌పోల్ సమాచారంతో కంటైనర్ కోసం నౌకను ట్రాక్ సీబీఐ చేసింది. విశాఖలో కంటైనర్ దించి తమిళనాడు కట్టుపల్లి పోర్టుకు నౌక వెళ్లినట్లు తెలుసుకున్నారు. డ్రగ్స్ కంటైనర్‌ను విశాఖలో దించినట్లు నౌకా సిబ్బంది ద్వారా సీబీఐ నిర్ధారించుకున్నారు. దిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందం, కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కంటైనర్‌లో 25 కిలోల చొప్పున వెయ్యి బ్యాగుల్లో డ్రైడ్ ఈస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 19న నమూనాలు సేకరించి పరిశీలించగా, సేకరించిన 49కి గాను 27 నమూనాల్లో డ్రగ్స్ గుర్తించారు.