ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరో అధికారిపై ఈసీ వేటు - ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ బదిలీ - AP Beverages Corp Ltd MD transfer - AP BEVERAGES CORP LTD MD TRANSFER

AP Beverages Corporation Limited MD transferred: ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డిని తక్షణం బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తనకంటే దిగువ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి వెళ్లాలని వాసుదేవరెడ్డిని ఆదేశించింది.

AP_Beverages_Corporation
AP_Beverages_Corporation

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 16, 2024, 4:10 PM IST

Updated : Apr 16, 2024, 4:25 PM IST

AP Beverages Corporation Limited MD Transferred: ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డిని తక్షణం బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తనకంటే దిగువ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి తక్షణం వెళ్లాలని వాసుదేవరెడ్డిని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, ఆయనకు ఎలాంటి ఎన్నికల విధుల్నీ అప్పగించొద్దని స్పష్టం చేసింది.

ప్రత్యామ్నాయంగా ఇవాళ రాత్రి 8 గంటల్లోగా బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ నియామకం కోసం ముగ్గురు ఐఎఎస్ అధికారుల పేర్లు పంపాలని సూచించింది. మద్యం ఉత్పత్తి, విక్రయాల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలు రావడంతో ఈ మేరకు వాసుదేవరెడ్డిపై ఈసీ చర్యలు చేపట్టింది.

Last Updated : Apr 16, 2024, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details