ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నూతన సంవత్సర వేడుకలు వద్దు'- ఎందుకంటే! - NO OFFICIAL NEW YEAR CELEBRATIONS

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలు, శాలువాలు తీసుకురావొద్దు: సీఎం చంద్రబాబు

andhra_pradesh_government_cancels_official_new_year_celebrations
andhra_pradesh_government_cancels_official_new_year_celebrations (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2025, 12:38 PM IST

Andhra Pradesh Government Cancels Official New Year Celebrations : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశ వ్యాప్తంగా సంతాప దినాలు కొనసాగుతున్న దృష్ట్యా అధికారికంగా ఎలాంటి వేడుకలు వద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సాధారణ పరిపాలనశాఖ సూచనలు జారీ చేసింది. జనవరి 1 తేదీన సాధారణంగానే విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటి లాగే అధికారులు కలెక్టర్లు, ఎస్పీలను కలవొచ్చని వెల్లడించింది. జనవరి 1 తేదీ వరకూ దేశవ్యాప్తంగా సంతాప దినాలు కొనసాగుతున్న దృష్ట్యా అధికారికంగా కేక్ కటింగ్ లాంటి వేడుకలకు దూరంగా ఉండాలని సూచనలు ఇచ్చింది.

తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలు, శాలువాలు తీసుకురావొద్దని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో ఎలాంటి సందేహం ఉన్నా కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్, లేదా బ్లూ బుక్ చూసి నివృత్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. సంతాప దినాలు పూర్తి అయ్యేంతవరకు అధికారికంగా ఎలాంటి వేడుకలు మీట్ అండ్ గ్రీట్ నిర్వహించొద్దని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details