తెలంగాణ

telangana

ETV Bharat / state

వారాహి దీక్షలో పవన్ కల్యాణ్ ​- నేటి నుంచి 11 రోజుల పాటు ఉపవాసం - AP Deputy CM pawan deeksha - AP DEPUTY CM PAWAN DEEKSHA

AP Deputy CM Pawan Kalyan Varahi Ammavari Deeksha : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటి నుంచి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. దైవభక్తి మెండుగా ఉన్న పవన్ వారాహి అమ్మవారి భక్తుడన్న విషయం తెలిసిందే.

AP Deputy CM Pawan Kalyan Varahi Ammavari Deeksha
AP Deputy CM Pawan Kalyan Varahi Ammavari Deeksha (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 25, 2024, 12:59 PM IST

Updated : Jun 25, 2024, 1:09 PM IST

AP Deputy CM Pawan Kalyan Varahi Ammavari Deeksha :ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇవాళ్టి నుంచి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. దైవ భక్తి మెండుగా ఉన్న పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి భక్తుడు. అందుకే జనసేన అధినేతగా తన ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్న వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు. ఇటీవలి ఎన్నికలలో జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన 21 అసెంబ్లీ 2 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది.

తెలుగుదేశం, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలలో 2 లోక్ సభ స్ధానాలలో పోటీ చేసిన సంగతి తెలిసిందే. పోటీ చేసిన అన్ని స్థానాల నుంచి విజయం సాధించడమే కాకుండా స్వయంగా పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ కీలక శాఖల బాధ్యతలు చేపట్టడమే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు.

ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టేందుకు టాస్క్‌ ఫోర్స్‌ను బలోపేతం చేస్తాం : పవన్​ కల్యాణ్ - Pawan Kalyan on AP Red Sandalwood

ఎన్నికలలో ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని పవన్ కల్యాణ్ 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష పాటించనున్నారు. ఈ దీక్షలో పవన్ కల్యాణ్ కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటారు. మంగళవారం జూన్‌ 25 నుంచి పవన్ ఈ దీక్ష పాటించనున్నారు. గత ఏడాది జూన్‌లో కూడా పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష పాటించిన సంగతి తెలిసిందే.

'అక్కడమ్మాయితో ఇక్కడబ్బాయి' - నెట్టింట పవన్ కల్యాణ్, సుప్రియ ఫొటో ట్రెండింగ్ - ACTRESS SUPRIYA MEETS PAWAN KALYAN

ఏపీ అసెంబ్లీలో అసక్తిగా పవన్ కల్యాణ్ తొలి స్పీచ్ - ఏం మాట్లాడారో తెలుసా? - AP Deputy CM Pawan Kalyan

Last Updated : Jun 25, 2024, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details