Pawan Kalyan Press Meet: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టరేట్లో పంచాయతీరాజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. అటవీ, పర్యావరణ విభాగాల అధికారులతో కూడా పవన్ కల్యాణ్ సమీక్షించారు. పవన్‌తో పాటు ఎంపీ ఉదయ్, చినరాజప్ప, పంతం నానాజీ సమీక్షలో పాల్గొన్నారు.
ఇన్ని సంవత్సరాలు నుంచి పంచాయతీ నిధులు రావడం లేదని తెలిసిందని, ఒక్క ఇసుకలో ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి వెయ్యి కోట్లు పక్కదారి మళ్లించారని, మొత్తంగా 5000 వేల కోట్లు నిధులు దారి మళ్లించారని చెప్పుకొచ్చారు. ఏపీ మినరల్ డెవలపమెంట్ కార్పొరేషన్ నుంచి పంచాయతీలకు వస్తాయిని, అయితే ఆ నిధులను పంచాయతీలకు ఇవ్వలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వీటి మీద 48 గంటల్లో పూర్తి నివేదిక కలెక్టర్ అందిస్తారని చెప్పారని చెప్పారు.
అటవీ శాఖ పరంగా కాకినాడ సమీపంలో హోప్ ఐల్యాండ్, మడ అడవులు కాపాడుకోవాలని, ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నమన్నారు. కాలుష్య నియంత్రణ మీద అధికారులు ఒక నివేదిక అందిస్తామన్నారని, పర్యావరణ సమతుల్యత కాపాడాలని తెలిపారు.
భూతాపం పెరిగిపోతోందని, అందుకే పర్యావరణ పరంగా పరిశ్రమల ఏర్పాటు సమయంలో కొన్ని నిబంధనలు పాటింపు మీద దృష్టి పెట్టామన్నారు. అటవీ శాఖ పరిధిలో లేని మడ అడవులను సైతం అటవీ శాఖ పరిరక్షణ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. నీటి పిల్లుల సంరక్షణ, వాటి గణన చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.