తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ - ఏపీ కేబినెట్ ఆమోదం - NTR UNIVERSITY OF HEALTH SCIENCES - NTR UNIVERSITY OF HEALTH SCIENCES

Dr. NTR University Of Health Sciences Name Restored : ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

NTR University Of Health Sciences
NTR University Of Health Sciences (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 2:58 PM IST

Updated : Jun 24, 2024, 3:54 PM IST

Dr.NTR University of Health Sciences Name in AP :ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చేసిన ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు వైద్య ఆరోగ్య యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దాదాపు మూడున్నర గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్‌ చట్టం రద్దు, ఏప్రిల్‌ నుంచి పింఛను రూ.4వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కొత్తగా టెట్‌ నిర్వహణ, టెట్‌ లేకుండా డీఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. జులై ఒకటి నుంచి డీఎస్సీ నిర్వహణ ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్‌ 10లోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా రూపొందించిన షెడ్యూల్‌ను అధికారులు కేబినెట్‌ ముందుంచారు.

మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం - మరికొన్ని కీలక నిర్ణయాలు ఇవే! - AP CABINET APPROVES MEGA DSC

AP Cabinet Meeting Key Decisions 2024 :పింఛన్ల పెంపు అంశంపైన కీలకంగా చర్చించిన మంత్రివర్గం, దీని కింద ఇచ్చే మొత్తం రూ.3వేల నుంచి రూ.4లకు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపింది. జులై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలన్న కేబినెట్ నిర్ణయంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత మూడునెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి రూ.7వేల పింఛను అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు.

మరోవైపు ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గంజాయి నివారణకు హోంమంత్రి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కేబినెట్ ఇందులో హోం, రెవెన్యూ, హెల్త్‌, గిరిజన శాఖ మంత్రులను సభ్యులుగా చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు గంజాయి నియంత్రణపై మంత్రుల కమిటీలో సభ్యుడిగా మంత్రి నారా లోకేశ్‌ ఉండనున్నారు. 6 శాఖలతో పాటు పోలవరం, అమరావతి, విద్యుత్‌, పర్యావరణం, మద్యం, ఆర్థిక అంశాలతో పాటు శాంతిభద్రతల అంశంపైనా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. కేబినెట్‌ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ఏపీలో నూతన ప్రభుత్వ తొలి కేబినెట్​ భేటీ - కీలక అంశాలపై నిర్ణయాలు! - AP Cabinet Meeting 2024

Last Updated : Jun 24, 2024, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details