Anantapur District Students Did Not Attend Tenth Class Supplementary Exams : ఉమ్మడి అనంతపురం జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత పొందని విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షలు రాసేందుకు హాజరవ్వడం లేదు. ఈనెల 24 నుంచి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుత్తీర్ణులైన విద్యార్థులు చాలా వరకు పరీక్ష ఫీజు చెల్లించకపోగా ఫీజు చెల్లించిన వారిలో 90 శాతం మంది పరీక్షకు గైర్హాజరవుతున్నారు.
నాడు-నేడు పేరిట ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మార్చుతామని జగన్ ఊదరగొట్టారు. పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే విద్యార్థుల డ్రాపౌట్లు తగ్గుతాయని చెప్పుకొచ్చారు. ఐతే బడుల ఆధునికీకరణ పేరిట వైఎస్సార్సీపీ నాయకులు దోచుకునేందుకు అవకాశం కల్పించిన జగన్ ప్రభుత్వం విద్యార్థులను నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమైందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మూడు రోజులుగా నిర్వహిస్తున్న సప్లమెంటరీ పరీక్షలకు 90 శాతం విద్యార్థులు హాజరుకాకపోవడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు.
ఓ వైపు తల్లి మరణం - మరోవైపు భవిష్యత్ - బాధను దిగమింగి పదో తరగతి పరీక్షకు హాజరు - Student Attend to SSC Exam
అనంతపురం జిల్లాలో మార్చిలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు 30వేల 893 మంది హాజరు కాగా, 13వేల 400 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వీళ్లంతా సప్లమెంటరీ పరీక్షలు రాయడానికి 45 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్ పరీక్షలు పూర్తయ్యాయి. హిందీ పరీక్షకు 90 శాతం, తెలుగు పరీక్షకు 52 శాతం, ఆంగ్లం పరీక్షకు 77 శాతం మంది విద్యార్థులు హాజరు కాలేదు.
శ్రీ సత్యసాయి జిల్లాలో మార్చిలో నిర్వహించిన పదో తరగతి పరీక్షకు 23 వేల 816 మంది విద్యార్థులు హాజరు కాగా, 7 వేల 300 మంది ఫెయిల్ అయ్యారు. వీరంతా సప్లమెంటరీ పరీక్షలు రాసేందుకు జిల్లాలో 29 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. హిందీ పరీక్షకు 70 శాతం, తెలుగు పరీక్షకు 53 శాతం, ఇంగ్లీష్ పరీక్షకు 68 శాతం మంది గైర్హాజరయ్యారు. సప్లమెంటరీ పరీక్ష రాసేందుకు పరీక్ష జరుగుతున్న రోజే ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌లో హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకుని హాజరయ్యే వెసులుబాటు కల్పించినా చాలా మంది విద్యార్థులు ముందుకు రాలేదు.
కొడుకుతో కలిసి టెన్త్ ఎగ్జామ్స్ రాసిన 'జ్యోతి'- ఎన్ని మార్కులతో పాసైందంటే? - Mother And Son Passed In Tenth Exam
'పది'తోనే సరిపెడుతున్నారా?!- సప్లమెంటరీ పరీక్షలకు విద్యార్థుల గైర్హాజర్పై ఆందోళన (ETV Bharat) కొన్నిచోట్ల ఫీజు చెల్లించకపోయినా పరీక్ష రాయడానికి రావాలంటూ ఉపాధ్యాయులే విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి హాల్ టికెట్లు ఇచ్చినా, విద్యార్థులు పరీక్షకు రాలేదు. తాడిపత్రిలో ఓ ప్రధానోపాధ్యాయుడు ఫీజు చెల్లించని విద్యార్థులకు హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసి ఇళ్ల వద్దకు స్వయంగా వెళ్లి ఇచ్చినా పరీక్షకు హాజరు కాలేదని అధికారులే చెబుతున్నారు. ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించకపోవడం వల్లే విద్యార్థులు పరీక్ష తప్పారని, సప్లమెంటరీ పరీక్ష రాసినా ఉత్తీర్ణులు కాలేమని భయంతో పరీక్షకు రాలేదని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షలకు గైర్హాజరు కావడంపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.
ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన తల్లీకొడుకులు- ఇద్దరిలో 'ఆమె'కే ఎక్కువ మార్కులు