ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి'- ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులు - ELECTION CAMPAIGN - ELECTION CAMPAIGN

Alliance Leaders Election Campaign in AP : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమి నేతలు ప్రచార జోరును పెంచారు. సూపర్​సిక్స్​ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వైసీపీ అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని కూటమి నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు. చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని వెల్లడిస్తున్నారు.

election_campaign
election_campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 4:39 PM IST

Alliance Leaders Election Campaign in AP : రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇంటింటికి సూపర్‌సిక్స్‌ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. సంక్షేమ, అభివృద్ధి పాలన కావాలంటే చంద్రబాబుకు అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విన్నవించారు.

Nellore District: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. ప్రజలపై అన్నిరకాల భారాలను మోపడంతో పేదల బ్రతుకు దుర్బరమైందన్నారు.నెల్లూరు అర్బన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేపట్టారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం హయాంలో నెల్లూరును అన్ని విధాల అభివృద్ధి చేశామని, తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని ఈ సందర్భంగా ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు గెలుపుతో ఆగిపోయిన అభివృద్ధిని తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు. పలువురు వైసీపీ నాయకులను కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

'రాష్ట్రం ప్రగతి బాటలో నడవాలంటే చంద్రబాబు సీఎం కావాలి'- ఎన్నికల ప్రచారంలో కూటమి జోరు - TDP Leaders Election Campaign In AP

Prakasam District :ప్రకాశం జిల్లా ఒంగోలులోని 36వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది వైసీపీ కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. వైసీపీ పాలనలో భూకబ్జాలు కూడా ఎక్కువ జరిగాయని దామచర్ల విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా ఈసారి ప్రజలు నమ్మే స్థితిలో లేరని బాపట్లజిల్లా పర్చూరు కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు. మార్టూరు లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన టీడీపీని గెలిపించుకుంటేనే రాష్టాభివృద్ది సాధ్యమన్నారు.

అడుగడుగునా సమస్యలపై నిలదీత - ప్రచారం నుంచి జారుకున్న వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి - Protest To MLA Sai Prasad Reddy

YSR District :వైఎస్సార్‌ జిల్లా కమలాపురంలో తెలుగుదేశం నేత పుత్తా నరసింహారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నుంచి వంద మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. జగన్‌ గత ఎన్నికల్లో కోడి కత్తి దాడి అని ప్రజలను నమ్మించారని. తిరిగి ఇప్పుడు రాయితో దాడి చేశారని ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రేణుమాకులపల్లిలో టీడీపీ అభ్యర్థి తనయుడు పయ్యావుల విజయసింహా ఎన్నికల ప్రచారం చేపట‌్టారు. ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. టీడీపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. శ్రీకాకుళం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గొండు శంకర్ ఆధ్వర్యంలో బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమాన్ని కూటమి శ్రేణులు హోరెత్తించారు. చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలే ఎన్డీఏ కూడమి విజయానికి దోహదపడుతున్నాయని గొండు శంకర్ ధీమా వ్యక్తం చేశారు.

రైతులకు సాగునీరు అందించడంలో జగన్‌ ప్రభుత్వం విఫలం: కొణతాల రామకృష్ణ - Konatala Ramakrishna

Manyam District : మన్యం జిల్లా పార్వతీపురంలో కూటమి అభ్యర్థి విజయచంద్ర ఎన్నికల ప్రచారం చేపట్టారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేపట్టి సూపర్ సిక్స్ పథకాలు వివరించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఆర్యవైశ్యులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details