Pawan Kalyan Congratulated to CM Chandrababu:కూటమి ప్రభుత్వం కొలువుదీరాక రాష్ట్రంలో మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ హోదాలో సభాపతి స్థానంలో ఆశీనులు అయ్యారు. అసెంబ్లీ మొదటి గేటు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూటమి ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో పూజలు నిర్వహించి చంద్రబాబు ఆశీనులయ్యారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చంద్రబాబును ఆలింగనం చేసుకున్నారు.
నేడే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం - కొలువుదీరనున్న 16వ శాసనసభ - AP ASSEMBLY SESSION
సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. జగన్ పట్ల గౌరవంగా వ్యవహరించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. సాధారణ సభ్యుడైన జగన్ వాహనాన్ని లోపలికి అనుమతించాల్సిందిగా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతించాలని నిర్ణయించారు. కౌరవ సభ నుంచి గౌరవ సభగా మారిన నేపథ్యంలో దానికి అనుగుణంగా నడుచుకోవాలని ఆయన నిర్ణయించారు.