ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మండుటెండల్లోనూ జోరుగా ప్రచారం - గెలుపే లక్ష్యంగా కూటమి అడుగులు - ALLIANCE CANDIDATES CAMPAIGN - ALLIANCE CANDIDATES CAMPAIGN

Alliance Candidates Election Campaign in AP : ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు దూకుడు పెంచారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా నియోజకవర్గాల్లో దూసుకుపోతున్నారు. ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని ఏపీ బాగుపడాలంటే బాబుకు ఓటేయాలని కూటమి అభ్యర్థులు కోరుతున్నారు.

Alliance_Candidates_Election_Campaign_in_AP
Alliance_Candidates_Election_Campaign_in_AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 6, 2024, 9:42 PM IST

మండుటెండల్లోనూ జోరుగా ప్రచారం - గెలుపే లక్ష్యంగా కూటమి అడుగులు

Alliance Candidates Election Campaign in AP :ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నా లెక్క చేయకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రతి ఇంటి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఐదేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రం బాగుపడాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు.

రాష్ట్రంలో జోరుగా కూటమి నేతల ప్రచారం - హారతులతో స్వాగతం పలుకుతున్న మహిళలు

మత్స్యకారుల సమస్యలను మంత్రి అప్పలరాజు పట్టించుకోలేదని పలాస నియోజకవర్గ కూటమి అభ్యర్థి గౌతు శిరీష ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో కూటమి అభ్యర్థి శిరీష ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా గ్రామస్థులు నృత్యాలు చేయగా శిరీష కూడా వారితో కలసి కాలు కదిపారు. సూపర్ సిక్స్ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళం కూటమి అభ్యర్థి గొండు శంకర్ నగరంలో సైకిల్ యాత్ర చేపట్టారు. అరసవల్లి కూడలి నుంచి ఏడు రోడ్లు కూడలి వరకు జరిగిన సైకిల్ యాత్రలో వేలాదిమంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

వైసీపీ పాలనలో కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి : జగన్‌ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయని పాయకరావుపేట కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత విమర్శించారు. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెంలో ఆమె ప్రచారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్‌ ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టణంలో నెలకొన్న మురుగునీటి సమస్యను పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో జోరందుకున్న టీడీపీ ప్రచారం- గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల ప్రచార పర్వం

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణను గెలిపించాలని కోరుతూ ఆయన భార్య కృష్ణ తులసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. అపార్ట్‌మెంట్లలో ఓటర్లను కలసి ఓట్లు అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని బాపట్ల జిల్లా చీరాల కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య అన్నారు. చీరాల మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఉదయపునడక చేస్తున్న వారిని పలకరించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొద్దిసేపు క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడి ఉత్సాహపరిచారు.

రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి :అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం సమక్షంలో 50 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. మైదుకూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. దువ్వూరు మండలం పెద్దజొన్నవరంలో పార్టీ శ్రేణులతో ప్రచారం నిర్వహించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. వైఎస్సార్‌ జిల్లా వేంపల్లిలో కడప ఎంపీ కూటమి అభ్యర్థి భూపేష్‌ రెడ్డికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని భూపేష్‌రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు.

అధికారంలోకి వచ్చాక పింఛనే కాదు అన్ని సంక్షేమ పథకాలు మీ ఇంటి వద్దకే : నారా లోకేశ్
కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌కు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. టి. కొత్తపల్లికి విచ్చేసిన ఎమ్మెల్యేను ఎమ్మార్పీఎస్ నాయకులు అడ్డుకున్నారు. తాము అభ్యంతరం చెబుతున్నా ఎమ్మెల్యే బాబూ జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి పూలమాల వేశారని ఆరోపిస్తూ దండను తొలగించారు. ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌ అంటూ ఎమ్మార్పీఎస్ శ్రేణులు నినాదాలు చేయడంతో చేసేదేం లేక ఎమ్మెల్యే అక్కడ్నుంచి జారుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details