Akkineni Nagarjuna Family Visit Srisailam : ఇటీవల అక్కినేని నాగచైతన్య, శోభిత వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో నూతన వధూవరులతో కలిసి అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు మల్లిఖార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. నూతన వధూవరులు స్వామివారికి రుద్రాభిషేకం చేసిన అనంతరం అర్చకులు వేదాశీర్వచనం పలికారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మహాద్వారం వద్ద వారికి స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.
అక్కినేని నాగార్జున ట్వీట్ :నాగచైతన్య-శోభిత పెళ్లి ఫొటోలను తాజాగా అక్కినేని నాగార్జున తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా, ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డియర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్యాన్స్ అంటూ ట్వీట్ చేశారు. మీ ప్రేమ, ఆశీస్సులు ఈ వేడుకను ప్రత్యేకం చేశారని అన్నారు. ఈ అందమైన క్షణాల్లో మమ్మల్ని అర్థం చేసుకున్న మీడియాకు ధన్యవాదాలు. కృతజ్ఞతతో నా హృదయం ఉప్పొంగుతోంది' అని అంటూ నాగార్జున ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
నాగచైతన్య - శోభిత వివాహం : అక్కినేని ఇంట ఈనెల 4వ తేదీన పెళ్లి బాజా మోగిన విషయం తెలిసిందే. హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వైహిక బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలే హిందూ సంప్రదాయ పద్ధతిలో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సినీ పెద్దలు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు.