ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీక్రెట్ ఆపరేషన్ - సీబీఐ అదుపులో వాయుసేన అధికారి - AIR FORCE OFFICER CAUGHT CBI IN AP

భర్తిపూడిలో సీబీఐ సోదాలు - లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన వాయుసేన అధికారి

Air Force Officer Caught CBI in Bribe
Air Force Officer Caught CBI in Bribe (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2025, 9:19 AM IST

Air Force Officer Caught CBI in AP :బాపట్ల జిల్లాలోని భర్తిపూడిలో సీబీఐ అధికారులు ఆదివారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అవినీతి ఆరోపణల వ్యవహారంలో వాయుసేనకు చెందిన ఓ కర్నల్‌ స్థాయి అధికారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ప్రాథమిక సమాచారం మేరకు వాయుసేన అధికారి అవినీతికి సంబంధించి అందిన ఫిర్యాదుపై కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. విజయవాడ నుంచి సీబీఐ అధికారుల బృందం నాలుగు కార్లలో గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో జీబీసీ రోడ్డు వద్ద అప్పికట్ల రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గంలో మకాం వేశారు.

వల పన్ని సదరు వాయుసేన అధికారిని భర్తిపూడికి రప్పించారు. ఈ క్రమంలో అతను లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. నగదు కట్టలు స్వాధీనం చేసుకోవడాన్ని స్థానికులు చూశారు. ఈ వ్యవహారాన్ని కొందరు గ్రామస్థులు సెల్‌ఫోన్​లో వీడియోలు, ఫొటోలు తీయబోగా సీబీఐ అధికారులు వారిని వారించారు. స్థానిక రైల్వేస్టేషన్‌లోకి ఆ అధికారిని తీసుకెళ్లి కొద్దిసేపు విచారించారు. ఆయన వచ్చిన కారును స్వాధీనం చేసుకుని రైల్వేస్టేషన్‌ వద్దకు తరలించారు.

ఈ సమాచారం తెలిసి అప్పికట్ల రైల్వేస్టేషన్‌ వద్దకు మీడియా బృందం వెళ్లగా సీబీఐ అధికారులు వారిని అనుమతించలేదు. దాడుల వివరాలు వెల్లడించటానికి నిరాకరించారు. పూర్తి స్థాయి సమాచారాన్ని అధికారికంగా ఈరోజు తెలియజేస్తామని చెప్పారు. కొద్దిసేపు తర్వాత రెండు కార్లలోని సీబీఐ బృందం సూర్యలంక వాయుసేన కేంద్రం వైపు వెళ్లారు. మిగిలిన రెండు కార్లలో వచ్చిన అధికారులు అప్పికట్ల రైల్వేస్టేషన్‌ వద్దే ఉన్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సీబీఐ వలలో కాకినాడ కస్టమ్స్ అధికారులు - సికింద్రాబాద్​లో పట్టివేత - CBI Arrest Customs Superintendent

రూ.కోటిన్నర లేదంటే రెండు ప్లాట్లు కోరిన సీఐ - లంచం డబ్బులు లెక్కిస్తుండగా ఏమైందంటే! - Corrupt Police

ABOUT THE AUTHOR

...view details