AP Agriculture Budget 2024 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. శాసనసభలో మంత్రి అచ్చెన్నాయుడు రూ.43,402.33 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. భూసార పరీక్షలకు రూ.38.88కోట్లు, విత్తనాలు పంపిణీ కి రూ.240కోట్లు, ఎరువుల సరఫరాకు రూ.40కోట్లు, పొలం పిలుస్తోంది రూ.11.31కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి రూ.422.96కోట్లు కేటాయించారు. డిజిటల్ వ్యవసాయo రూ.44.77కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ రూ.187.68కోట్లు, వడ్డీలేని రుణాలకు రూ.628కోట్లు, అన్నదాత సుఖీభవ రూ.4500కోట్లు, రైతు సేవా కేంద్రాలకు రూ.26.92కోట్లు కేటాయించారు.
రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ - శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
ఇంటిగ్రేటెడ్ అగ్రీ ల్యాబ్స్ రూ.44.03కోట్లు, పంటల భీమాకు రూ.1023కోట్లు కేటాయించారు. వ్యవసాయ శాఖకు రూ.8564.37కోట్లు, ఉద్యాన శాఖకు రూ.3469.47కోట్లు, పట్టు పరిశ్రమకు రూ.108.4429కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్ రూ.314.80కోట్లు, సహకార శాఖకు రూ.308.26కోట్లు,ప్రకృతి వ్యవసాయం రూ.422.96కోట్లు, డిజిటల్ వ్యవసాయo రూ.44.77కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ రూ.187.68కోట్లు, వడ్డీలేని రుణాలకు రూ.628కోట్లు,అన్నదాత సుఖీభవ రూ.4500కోట్లు కేటాయించారు. రైతు సేవా కేంద్రాలకు రూ.26.92కోట్లు, ఇంటిగ్రేటెడ్ అగ్రీ ల్యాబ్స్ రూ.44.03కోట్లు కేటాయించారు.