After Btech Job or Higher Studies Which is Better :చాలా మంది విద్యార్థులు బీటెక్ (Btech) పూర్తైన తరువాత ఏమి చేయాలి అనే ఆలోచనలో పడతారు. ఉద్యోగం చేయాలా లేక మాస్టర్స్ చేయాలా అన్న ప్రశ్న వారి మొఖంలో కనిపిస్తుంది. అలాంటి వారికి నిపుణులు ఏమి చేప్తున్నారంటే బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నారంటే అప్పటికే కెరియర్ గురించి ఒక నిర్ణయానికి రావాలని అంటున్నారు. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం మొదట్లోనే బీటెక్ తరువాత ఏమి చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆ దిశలో ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఎంటెక్ (MTech) చేయాలా? ఉద్యోగం చేయాలా? అన్నది వారి వ్యక్తిగత నిర్ణయం. ఎందుకంటే ప్రతి ఒక్కరి నిర్ణయాన్ని వాళ్ల ఆర్థిక స్థోమత, కుటుంబ పరిస్థితులు ప్రభావితం చేస్తాయి.
Guidelines To BTECH Students in Telugu :ఎంటెక్ చేయాలి అనుకుంటే గేట్ 2025 (GATE 2025) రాసి మంచి ర్యాంకు సాధించాలి. ఎన్‌ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీల్లోలాంటి వాటిల్లో ప్రవేశం పొందాలి. ప్రస్తుతం మీరు చదువుతున్న బీటెక్ కాలేజీ కంటే మెరుగైన ర్యాంకున్న ఎంటెక్ కాలేజీని ఎంపిక చేసుకోవాలి. అప్పుడే ఎక్కువ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఒకవేళ ఎంఎస్ (MS) చేసే ఆలోచనలో ఉంటే ఐఈఎస్‌టీఎస్/టోఫెల్, జీఆర్‌ఈ లాంటి పరీక్షలు రాయాలి. వీటిలో మంచి స్కోరు సాధిస్తే ఇతర దేశాల్లో మంచి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభిస్తోంది. ఎంటెక్/ఎంఎస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్, డేటా సైన్స్ లాంటి సబ్జెక్టులు చదివే అవకాశం ఉంటుంది.
ఫారిన్లో హయ్యర్ స్టడీస్ చేయాలా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్! - Abroad Higher Education Guide