Adilabad Man Getting Huge Income From Watermelon Farming : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంప్రదాయ పంటలతో పాటు వేసవిలో విభిన్న పంటలు సాగవుతున్నాయి. అందులో ఒకటి పుచ్చకాయ సాగు. ఎండాకాలంలో దీనికి మంచి గిరాకీ ఉండటంతో రైతులు దీని సాగుకు మొగ్గు చూపుతున్నారు. తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ ఆదాయం వస్తుండటంతో లాభదాయక పంటగా రైతులు సాగు చేస్తున్నారు. పుచ్చకాయ పంట కాలవ్యవధి 65 రోజులు కాగా, సాగులో మెళకువలు పాటించి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. అంతే కాకుండా సరిగ్గా ప్లాన్ చేసి ఎండాకాలం రాక ముందే పంటను వేస్తే, వేసవిలో మంచి దిగుబడితో పాటు ఆదాయం పెరుగుతుందని అంటున్నాడు మల్లేశ్.
"ఒక ఎకరంలో సగం పుచ్చకాయ, మిగతా దాంట్లో బెండకాయ, బీర, కాకరకాయ సాగు చేస్తున్నాను. మొత్తం ఎకరానికి దాదాపు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు వస్తుంది. అన్నీ పోనూ రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు మిగులుతుంది. డిప్ ద్వారా వ్యవసాయం చేస్తే పంటలు బాగా పండుతాయి. కాయ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అన్నిటికీ ఒకే రకం మందులు వాడుతున్నాం. పుచ్చకాయ కోసం ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏముండదు. ఈ పంట మాకు చాలా లాభదాయకంగా ఉంది." - మల్లేశ్, రైతు