ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గోవాలో నా పెళ్లి' - ఆ ముచ్చట బయటపెట్టిన కీర్తిసురేశ్ - KEERTHY SURESH VISITS TIRUMALA

వచ్చే నెలలో వివాహ బంధంలోకి అడుపెట్టాబోతున్న సినీ నటి కీర్తిసురేశ్‌ - శ్రీవారి దర్శనంతరం స్వయంగా వెల్లడించిన నటి

Actress Keerthy Suresh Visits Tirumala Temple
Actress Keerthy Suresh Visits Tirumala Temple (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2024, 1:03 PM IST

Updated : Nov 29, 2024, 1:28 PM IST

Actress Keerthy Suresh Visits Tirumala Temple :సినీ నటి కీర్తిసురేశ్‌ పెళ్లి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెలలోనే ఆమె వివాహ బంధంలోకి అడుపెట్టాబోతున్నారు. ఈ మేరకు ఆమె స్వయంగా వెల్లడించారు. కీర్తి సురేశ్ తన కుటుంబసభ్యులతో కలిసి ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తరువాత ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

అనంతరం కీర్తిసురేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పెళ్లి ముచ్చట బయటపెట్టారు. వచ్చే నెల డిసెంబర్​లోనే తను పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. తన వెడ్డింగ్‌ గోవాలో జరుగుతుందన్నారు. అదేవిధంగా తాను నటిస్తున్న హిందీ సినిమా కూడా వచ్చే నెలలో విడుదల అవుతుందని తెలిపారు. అందుకే స్వామివారి దర్శనం కోసం వచ్చానని నటి కీర్తిసురేశ్ తెలిపారు.

'గోవాలో నా పెళ్లి' - ఆ ముచ్చట బయటపెట్టిన కీర్తిసురేశ్ (ETV Bharat)

ప్రియుడి గురించి ఫస్ట్​ టైమ్ రివీల్ చేసిన కీర్తి సురేశ్ - అతడేనా?

ప్రస్తుతం 'బేబీ జాన్‌’ షూట్ పనుల్లో నటి కీర్తి సురేశ్‌ బిజీగా ఉన్నారు. ఈ సినిమాతోనే కీర్తి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వరుణ్‌ ధావన్‌ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదివరకే కోలీవుడ్‌లో విడుదలైన 'తెరీ’ రీమేక్‌గా ఈ చిత్రం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరోవైపు, ఇటీవలే తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి కీర్తి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. తన స్నేహితుడు ఆంటోనీతో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. ఆయనతో కలిసి దిగిన ఫొటోని సైతం షేర్‌ చేసింది. సుమారు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని సినీ నటి కీర్తి సురేశ్ ప్రకటించింది.

కీర్తి సురేశ్ పెళ్లి ఫిక్స్!- గోవాలో వెడ్డింగ్- వరుడు ఎవరంటే?

'మహానటి' ఇంట్లో పెళ్లి బాజాలు నిజమే!- ఆ రోజే కీర్తి తండ్రి అనౌన్స్ చేస్తారట!

Last Updated : Nov 29, 2024, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details