NTR Paid a Bill of 12 lakhs in Hospital to his Fan : ‘ఎన్టీఆర్ గారు నేను మీ గురించి తప్పుగా మాట్లాడలేదు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చా. మా కుటుంబసభ్యులంతా మీకు అభిమానులే’ అని సరస్వతి అనే మహిళ తెలిపారు. తన కుమారుడు కౌశిక్ ట్రీట్మెంట్కు ఆసుపత్రిలో అయిన ఖర్చును భరించిన జూనియర్ ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం (డిసెంబరు 23) మీడియా ముందుకొచ్చి సరస్వతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తన కుమారుడు కౌశిక్ డిశ్చార్జ్ అనంతరం ఆమె తాజాగా మరోసారి మాట్లాడారు.
"మంగళవారం సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ సిబ్బంది నుంచి నాకు ఫోన్ వచ్చింది. మేం వస్తున్నాం కౌశిక్‌ను డిశ్చార్జ్ చేయిస్తామని చెప్పారు. మా అబ్బాయి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు రూ.12 లక్షల బిల్లు కట్టి, నా కుమారుడిని డిశ్చార్జ్ చేయించారు. తన ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. నిన్న నేను మాట్లాడిన మాటల వల్ల ఎన్టీఆర్ అభిమానులు కాస్త ఫీలైనట్లు ఉన్నారు. మీరు అపార్థం చేసుకోవద్దు. మీ అందరి ఆశీర్వాదం వల్లే నా కొడుకు ఈ రోజు బాగున్నాడు". అని ఆమె పేర్కొన్నారు.