ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేను లోకల్​ - అప్పట్లో బైక్​పై వెళ్లేవాన్ని : బాలయ్య

నాచారంలో సినీహీరో బాలకృష్ణ సందడి - అభిమాన హీరోను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు

BALAKRISHNA OPENED MART IN NACHARAM
BALAKRISHNA OPENED MART IN NACHARAM (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Balakrishna Opened Mart in Nacharam : సాంకేతికంగా విడిపోయినా తెలుగువాళ్లందరూ ఒకటేనని, మన ఆలోచనలన్నీ ఒకటేనని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం అన్ని దేశాల్లో తెలుగువారు రాణిస్తున్నారని తెలిపారు. విదేశాల్లో వివిధ రంగాలతోపాటు రాజకీయాల్లోనూ మన వారు రాణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది మన దేశానికే గర్వకారణమని చెప్పారు. హైదరాబాద్​లోని నాచారంలో ఏర్పాటు చేసిన ఓ హైపర్ మార్కెట్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

అంతకు ముందు బాలకృష్ణ హైపర్ మార్కెట్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయనను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బాలకృష్ణతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. ప్రస్తుతం కొనుగోలుదారులంతా ఫ్యాషన్​, ఫుడ్​, ఫన్​ ఈ మూడు ఒకే చోట ఉన్న మార్కెట్​కు రావడానికి ఆసక్తి చూపుతున్నారని బాలకృష్ణ వివరించారు. నాచారానికి తాను లోకల్ అని, ఇక్కడున్న స్టూడియోకు బైక్‌పై వచ్చేవాడినని గుర్తు చేసుకున్నారు. ఎంబీబీఎస్​ విద్యార్థులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆర్థిక సాయం అందిస్తున్నారని, ఇప్పటి వరకు ఎంతో మందికి సాయం చేశారని ఆయణ్ని అభినందించారు.

నేను లోకల్​ - అప్పట్లో బైక్​పై వెళ్లేవాన్ని : బాలయ్య (ETV Bharat)

'మనం సాంకేతికంగా విడిపోయినా తెలుగువాళ్లు అంతా ఒకటే. అన్నీ దేశాల్లో తెలుగువారు రాణిస్తున్నారు. నేను నాచారానికి లోకల్​. గతంలో స్టూడియోకు బైక్​పైనే వెళ్లాను. ఎంబీబీఎస్​ విద్యార్థులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతో మందికి సాయం చేశారు.' - బాలకృష్ణ, సినీ హీరో

అమెరికాలో బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలు - Balakrishna 50 years

NBK 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ - వేడుకలో సినీ తారల సందడి! - NBK 50 Years Celebrations

ABOUT THE AUTHOR

...view details