ACB Speed up Investigation on Sheep Distribution in Telangana : గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగాయని బాధితులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెలు కొనుగోలు చేసి వారికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్(Gachibowli Police Station)లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును పోలీసు ఉన్నతాధికారులు ఏసీబీకి బదిలీ చేశారు. దర్యార్తులో భాగంగా గొర్రెల పంపిణీ పథకం(Sheep Distribution Scheme) కోసం గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు చెందిన 15 మంది రైతుల వివరాలను అధికారులు సేకరించారని బాధితులు చెప్పారు.
130 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసినందుకు గానూ వారికి రావాల్సిన నగదు రూ.2.10 కోట్లకు సంబంధించిన ఆధారాలన్నింటినీ అధికారులకు ఇచ్చామని బాధితులు తెలిపారు. మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ (Animal Husbandry Department) అధికారులు, కాంట్రాక్టర్ మోహినుద్దీన్ మధ్యవర్తిగా ఉండి తమ వద్ద గొర్రెలను తీసుకున్నారని తెలియజేశారు. తమకు రావలసిన నగదు చెల్లించకుండా మోసం చేసిందే కాకుండా దుర్భాషలాడారని ఏసీబీ అధికారులకు వివరించారు. వారి వద్ద ఉన్న ఆధారాలు తీసుకొని విచారణ అనంతరం న్యాయం చేస్తామని ఏసీబీ అధికారులు భరోసా ఇచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు.
మేకలు, గొర్రెలను దొంగిలిస్తున్న ముఠా అరెస్టు.. రూ. 7లక్షలు స్వాధీనం
"ప్రకాశం జిల్లాకు వచ్చి గొర్రెలు కావాలి అన్నారు. మాకు రూ.2.10కోట్లు డబ్బులు ఇవ్వాలి. మాకు రావాల్సిన డబ్బులను వారి బినామీలకు ఇచ్చారు. ఇంకా ఈ విషయం ఎవరికి తెలియదు. వారందరికి తెలిసాక అందరూ దీనిపై ఫిర్యాదు చేయడానికి వస్తారు. మాకు మా డబ్బులు ఇప్పించండి."- బాధిత రైతులు