ACB Raids in HMDA Planning Director House : ఆదాయానికి మించిన అస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై హెచ్‌ఎండీఏ(HMDA) టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ ఎస్ బాలకృష్ణ ఇళ్లు, కార్యాలయల్లో అవినీతి నిరోధక శాఖ సోదాలు చేసింది. ఇవాళ ఉదయం 5గంటల నుంచి బృందాలుగా విడిపోయి ఏసీబీ అధికారులు(ACB Officers) సోదాలు నిర్వహించారు.
బాసు లంచం అడిగావో జైలు ఖాయమంటున్న ఏసీబీ అధికారులు
ప్రస్తుతం ఆయన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి కార్యదర్శిగానూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో భాగంగా మాసబ్ ట్యాంక్‌లోని రెరా కార్యాలయం, హెచ్‌ఎండీఏ కార్యాలయం(HMDA Office), మణికొండలోని ఆదిత్య ఫోర్ట్ వివ్యూలో ఉన్న నివాసం, బంధువులు ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ, ఏకకాలంలో 20 చోట్ల 14 బృందాలతో దాడులు జరిపారు.
రూ.100 కోట్లకు పైగా ఆస్తులు :అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇష్టానుసారం అనుమతులు జారీ చేసి అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని, ఇటీవలఏసీబీకివచ్చిన సమాచారంతో అధికారులు సోదాలు చేశారు. కాగా ఇప్పటివరకూ రూ.100 కోట్లకుపైగా స్థిర, చర ఆస్తులు గుర్తించారు. వాటిలో రూ.40 లక్షల నగదు, రెండు కిలోల బంగారు ఆభరణాలు, ఖరీదైన 60 చేతి గడియారాలు, ఆస్తిపత్రాలు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు ధ్రువీకరించారు. అలానే 14 ఫోన్లు, 10 ల్యాప్‌టాప్‌లు మొదలగు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ సైతం ఉన్నట్లు గుర్తించి, వాటిని స్వాధీనపరచుకున్నారు.