ACB notices KTR in Formula E Car Racing Case: ఫార్ములా- ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఏసీబీ నోటీసులో తెలిపింది. ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో నిబంధనలు ఉల్లఘించి ఏ విధంగా విదేశీ సంస్థకు నిధులు చెల్లించారు, మంత్రి వర్గం, ఆర్ధిక శాఖ అనుమతులు తీసుకోకుండా నిధులు ఎలా బదిలీ చేశారు, ఎవరి ఆదేశాల మేరకు నిధులు బదిలీ జరిగింది తదితర కోణాల్లో కేటీఆర్‌ను ఏసీబీ ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది.
'విచారణకు రండి' - కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు - ACB NOTICES TO KTR
ఫార్ములా- ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్‌కు నోటీసులు - ఈనెల 6న ఉ.10కి విచారణకు రావాలన్న ఏసీబీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 3, 2025, 7:32 PM IST
మరో వైపు ఇదే కేసులో ఈ నెల 7వ తేదీన ఈడీ విచారణకు కేటీఆర్ హాజరుకావాల్సి ఉంది. దీంతో పాటు కేటీఆర్ తనపై నమోదైన కేసు కొట్టివేయాలని వేసిన క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగియడంతో, తీర్పును రిజర్వు చేసింది. అదే విధంగా తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఉత్తర్వులలో పేర్కొంది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు పొడిగించింది.
కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు - హైకోర్టు ఏం చెప్పిందంటే?