A Man Killed Dog Throwing Second Floor : రెండో ఫ్లోర్ పైనుంచి ఓ వ్యక్తి కుక్కను పడేసి చంపేశాడు. ఈ ఘటన హైదరాబాద్లోని షాహినాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిమ్రాజ్ బజారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిమ్రాజ్ బజారులో పిల్లలు టపాకాయలు కాలుస్తున్నారు. ఈ క్రమంలోనే అటుగా వచ్చిన కుక్కపై పిల్లలు టపాకాయలు వేయడంతో అది భయానికి గురై, అక్కడే ఉన్న ఓ బాలికపై దాడి చేసింది. దీంతో ఆగ్రహించిన బాలిక తండ్రి కుక్కను రెండో ఫ్లోర్ పైనుంచి కిందకి పడేశాడు. అనంతరం రాడ్డుతో కొట్టి చంపాడు.
కుక్కను రెండో ఫ్లోర్ నుంచి కిందకు విసిరేసి చంపిన వ్యక్తి - అలా చేసిందనే కోపంతో! - MAN KILLED DOG THROWING 2ND FLOOR
రెండో ఫ్లోర్ పైనుంచి కుక్కను కిందకు విసిరేసి చంపిన వ్యక్తి - నగరంలోని షాహినాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన - పోలీసుల అదుపులో నిందితుడు
A Man Killed Dog Throwing Second Floor (ETV Bharat)
Published : Nov 3, 2024, 4:52 PM IST
ఈ ఘటన జంతు ప్రేమికులను ఎంతో కలచివేసింది. ఎందుకు ఇలా చేశావని అక్కడున్న వారు ప్రశ్నిస్తే, వారితో దురుసుగా ప్రవర్తించాడు. కత్తితో బెదిరిస్తూ అడిగిన వారిపై విరుచుకుపడ్డాడు. అక్కడే ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కుక్కకు పోస్టుమార్టం నిర్వహించి, నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.