Rape on Six Months Baby in Vizianagaram :మహిళలు, చిన్నారులపై అత్యాచార ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలను అమల్లోకి తెస్తున్నా, వారికి రక్షణ లేకుండాపోతోంది. ముక్కు పచ్చలారని శిశువులపై సైతం అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఊయలలో ఉన్న ఆరు నెలల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన ఘటన తాజాగా విజయనగరం జిల్లాలో కలకలం రేపింది.
జిల్లాలోని రామభద్రాపురంలో ఆరు నెలల చిన్నారిపై వరుసకు తాత అయిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో చిన్నారికి రక్తస్రావమైంది. ఊయలలో ఉండగానే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రామభద్రాపురం మండలంలో శనివారం ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : చిన్నారిని తల్లి ఊయలలో వేసి గ్రామంలోని కిరాణా దుకాణానికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని ఈ సమయంలో నార్లవలస గ్రామానికి చెందిన బోయిన ఎరకన్న దొర అక్కడికి వచ్చి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి గట్టిగా ఏడవటంతో చిన్నారి అక్క (పెద్ద కుమార్తె) అక్కడికి చేరుకుని వెంటనే తల్లికి సమాచారం అందించింది.