తెలంగాణ

telangana

ETV Bharat / state

నేపాలీ దొంగల ముఠా - నమ్మారో ఇల్లు గుల్ల! - Nepali thieves - NEPALI THIEVES

Nepali Thieves in Hyderabad:హైదరాబాద్​లో రోజురోజుకు దొందతనాలు పెరిగిపోతున్నాయి. ఈ చోరీ చేసే వారిలో నేపాల్​తో పాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చోరీలకు పాల్పడేవారు యజమాని వద్ద నమ్మకం సంపాదించుకునే వరకూ ఇంట్లో వ్యక్తిలా కలిసిపోతారు. అవకాశం లభించగానే అందినకాడికి దోచుకోని సొంత రాష్ట్రాలకు పారిపోతుంటారు.

Nepali Thieves in Hyderabad
Nepali Thieves in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 19, 2024, 11:57 AM IST

Nepali Thieves in Hyderabad : హైదరాబాద్‌లో నేపాలీలు దొంగతనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కాపలాదారులు, ఇంటి పనివాళ్లుగా చేరుతున్న నేపాలీలు యజమాని వద్ద నమ్మకం సంపాదించుకునే వరకు వేచి చూస్తున్నారు. అవకాశం లభించగానే అందినకాడికి దోచుకోని తమదేశం పారిపోతున్నారు. దీనికోసం కొన్ని ముఠాలుగా వచ్చి, దేశంలోని పలు మహానగరాల్లో ఉంటూ అదనుచూసి చోరీలకు పాల్పడుతున్నారు.

సికింద్రాబాద్‌ ఓ ప్రముఖ బంగారం వ్యాపారి ఇంట్లో పనివాళ్లుగా చేరిన నేపాలీ దంపతులు 30లక్షల విలువైన వజ్రాభరణాలు కొట్టేశారు. పక్కా పథకంతో ఇంట్లోకి చేరి నమ్మకంగా ఉంటూనే యజమాని కుటుంబం ముంబయి వెళ్లగానే అందినంత దోచుకొని పారిపోయారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించి అరెస్ట్‌ చేసి రిమాండ్​కు తరలించారు. నగరంలోని జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఓ వ్యాపారి నివాసంలో 70లక్షల విలువైన సొత్తు మాయమైంది. ఇదంతా పనిమనుషుల చేతివాటమంటూ బాధితులు ఫిర్యాదు చేశారు.

తాజాగా దోమలగూడ గగన్‌మహల్‌ ప్రాంతంలో విశ్రాంత ఉద్యోగికి కేర్‌టేకర్‌గా చేరిన యువకుడు నమ్మకం చూరగొన్నాడు. ఆ తరువాత విశ్రాంత ఉద్యోగి బ్యాంకు ఏటీఎం కార్డులు తీసుకొని 30లక్షలు కాజేశాడు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నా సొమ్ము రికవరీలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిందితుడికి మతిస్థిమితం సరిగాలేదంటూ వైద్యుల నుంచి పొందిన సర్టిఫికెట్‌ చూపుతున్నట్లు సమాచారం.

నేపాలీ ముఠా కన్నేస్తే అంతే.. ఏకంగా 250కి పైగా చోరీలు..

ఈ ఏడాది నగరంలో 5 నెలల వ్యవధిలో ఈ తరహా చోరీలు మోసాలపై 40కు పైగా నగరంలో పోలీసులు కేసులు నమోదు చేశారు. గ్రేటర్‌లో పనిమనుషులకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఈ నేపధ్యంలో ఇంటా, బయటా సహాయకులుగా పనిచేసేందుకు స్ధానికులు పెద్దమొత్తంలో వేతనం ఆశించటంతో బయటి వారికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారైతే 24 గంటలు అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో యజమానులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. పనిలో కుదుర్చుకునే ముందుగానే వారి వ్యక్తిగత వివరాలు, నేరచరిత్రపై ఆరా తీయటం, ఆధార్, ఫోన్‌నెంబర్లు తీసుకోవాలని పోలీసులు పలుమార్లు సూచించినా అధికశాతం ఇంటి యాజయాన్యలు పెడచెవిన పెడుతున్నారు. హాక్‌-ఐ యాప్‌లో వివరాలు నమోదు చేస్తే తామే వారి పుట్టుపూర్వోత్తరాలు రాబడతామని సూచించినా తేలికగా తీసుకుంటున్నారు.

నగరంలోని సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన కుటుంబాలు అధికశాతం ఇతర రాష్ట్రాల వాళ్లను పనికి కుదుర్చుకుంటాయి. నివాసం, దుకాణాలు, కార్యాలయాల్లో సహాయకులు, వాచ్‌మెన్, తోటపని చేసేందుకు ముంబయి, దిల్లీ, యూపీ, బిహార్, నేపాల్‌కు చెందిన వారికి ప్రాముఖ్యతనిస్తారు. తక్కువ జీతంతో ఎక్కువ పని చేస్తారనే ఉద్దేశంతో యజమానులు ఏరికోరి వీళ్లనే ఎంపిక చేసుకుంటారు. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు దిల్లీ ముఠాలు రంగంలోకి దిగుతాయి. నేపాల్, బిహార్‌కు చెందిన యువకులు, మహిళలకు కమీషన్‌ ఆశచూపుతారు. ప్రయాణఛార్జీలు, రోజువారీ ఖర్చులతో హైదరాబాద్‌ పంపుతారు. వ్యాపార, సంపన్న కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తారు.

పనిమనుషుల ముసుగులో చేతికొచ్చిన సొమ్ముతో విలాసవంతంగా జీవిస్తున్న వీరిని గమనించిన యువకులు నేరబాట పడుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. కష్టార్జితం ఇంటిదొంగల పాలవకుండా ఉండేందుకు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కొరుతున్నారు.. విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో ఉంచటం, దూర ప్రాంతాలకు వెళ్లినపుడు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందజేయాలని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరుకు నేపాలీ గ్యాంగ్ చేసిన చోరీల వివరాలు ఇదేవిధంగా ఉన్నాయి. 2019 సంవత్సరంలో 87, 2020 సంవత్సరంలో 61, 2021 సంవత్సరంలో 90 2022 సంవత్సరంలో101, 2023 సంవత్సరంలో 116, 2024 సంవత్సరం దాదాపు ఇప్పటి వరుకు 40 కేసులు నమోదు అయిన్నట్లు సమాచారం.
Nepali Thieves Hyderabad : నమ్మకంగా పనిలో చేరతారు.. మత్తుమందు ఇచ్చి ఇళ్లంతా దోచేస్తారు..!

ABOUT THE AUTHOR

...view details