700Kgs Spoiled Chicken Seized In Begumpet :ఇటీవల కాలంలో హెటళ్లో తిండి తినాలి అంటేనే జంకుతున్నారు జనం. కారణం ఎప్పుడో తెచ్చిన మాంసాన్ని వండటం లేదా వండినదాన్నే వేడి చేసి విక్రయించడం. దీంతో ప్రజలు కాస్త సమయం తీసుకుని, ఓపిక తెచ్చుకుని ఆరోగ్యంగా ఉండాలని ఇంట్లోనే వండుకోని తినడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మనం తెచ్చుకునే మాంసమే రోజుల కొద్ది నిల్వ ఉంచి విక్రయిస్తే పరిస్థితి ఏంటి?. ఆరోగ్యం ఏమై పోవాలి?. ఇవన్నీ ఆలోచించకుండా కనీస ప్రమాణాలు పాటించకుండా ఓ దుకాణాదారుడు డబ్బుకు కక్కుర్తి పడి చేస్తున్న యవ్వారం ఇది.
వందల కిలోలు మాంసం నిల్వ ఉంచి గత కొన్ని నెలలుగా విక్రయిస్తున్నాడు ఓ చికెన్ షాప్ ఓనర్. అనుమానం వచ్చినవారు ఆహార భద్రత అధికారులకు సమాచారం ఇవ్వగా అసలు నిజం బయటపడింది. గత ఆరు నెలలుగా నిల్వ ఉంచిన మాంసాన్ని స్థానికంగా అమ్ముతూనే, మద్యం దుకాణాలు, బార్లు, హోటళ్లకు సప్లై చేస్తున్నాడు. ఆహార భద్రత అధికారులకు సమాచారం అందగా తనిఖీలు నిర్వహించి దుకాణాన్ని సీజ్ చేశారు.
టేస్టీగా ఉన్నాయని బయట దొరికే ఫుడ్లు లాగించేస్తున్నారా? - అయితే ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్ - Story On Food Adulteration
ఆహార భద్రత అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ బేగంపేట ప్రకాశ్ నగర్‌లో ఓ దుకాణాదారుడు చికెన్‌ను ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో పెట్టి విక్రయిస్తున్నాడు. నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్, కొవ్వు పదార్థాలు, కోడి ఎముకలకు కెమికల్స్ కలిసి మద్యం దుకాణాలకు, బార్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలను విరుద్ధంగా అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు దుకాణాన్ని సీజ్ చేశారు.
కుళ్లిన చికెన్‌ను తినడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని ఫుడ్ సేఫ్టీ అధికారులు పేర్కొన్నారు. గత ఆరు నెలల నుంచి వీటిని విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. తాము రైడ్ చేసినప్పుడు ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తోందని వెల్లడించారు. అలా దుర్వాసన వస్తున్న చికెన్‌కే కెమికల్స్ కలిపి అమ్మడం చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. ఇకనుంచైనా మాంసం కొనుగోలుకు వెళ్లినప్పుడు కాస్త జాగ్రత్తగా పరిశీలించండి.
ఆ హోటల్లో షవర్మా తిన్నారా? అయితే మీరు ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది!
ఆహార భద్రతలో తెలంగాణకు 23వ స్థానం - బయట ఫుడ్ తినేటప్పుడు కాస్త చూసుకోండి గురూ - SFSI 2024 Telangana Rank