తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా 395 ఎంపీడీవోలు బదిలీ - మరిన్ని ఉండే అవకాశం

MPDOs Transfers in Telangana : రాష్ట్రంలో 395 మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. సొంత జిల్లాల్లో పని చేస్తున్న వారితో పాటు మూడేళ్లకు పైగా ఒకే చోట పని చేస్తున్న వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టింది.

395 MPDOs Transfers
395 MPDOs Transfers in Telangana

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2024, 2:57 PM IST

Updated : Feb 11, 2024, 10:09 PM IST

MPDOs Transfers in Telangana :రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా పంచాయతీ రాజ్​ శాఖ పరిధిలోని 395 మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. సొంత జిల్లాల్లో పని చేస్తున్న వారితో పాటు మూడేళ్లకు పైగా ఒకే చోట పని చేస్తున్న ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని డిసెంబరులో ఈసీ(Election Commission) అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈసీ మార్గదర్శకాల మేరకు వివిధ శాఖలు బదిలీలు చేపట్టాయి. రెవెన్యూ శాఖ 132 మంది తహశీల్దార్లను, 32 మంది డిప్యూటీ కలెక్టర్లను శనివారం బదిలీ చేసింది. రెండు రోజుల్లో ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ భారీ బదిలీలు జరగనున్నాయని సమాచారం.

TahsildarTransfer in Telangana :రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ అధికారుల బదిలీలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే బడా బడా పోస్టుల్లో ఉన్న అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 132 మంది తహసీల్దార్లను ట్రాన్స్​ఫర్ చేస్తూ ప్రభుత్వం(Congress Govt) ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మల్టీ జోన్ 1లో 84, మల్టీ జోన్ 2 లో 48 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. కాగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఇవి చేపట్టినట్లు తెలుస్తుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు.

IAS Transfers in Telangana :ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అధికారులను బదిలీలు చేసింది. ఒకసారి ఆ వివరాలను గమనిస్తే, తాజాగా తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను, ఒక ఐఎఫ్​ఎస్ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా(TSPSC Secretary) ఈ నవీన్​ నికోలస్​ను ప్రభుత్వం నియమించింది.

హైదరాబాద్‌లో పలువురు ఐపీఎస్‌ల బదిలీ, క్రైమ్స్ జాయింట్ సీపీగా రంగనాథ్‌

నికోలస్‌ గతంలో గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడిగా ఉన్న సమయంలో గురుకుల నియామక బోర్డు కన్వీనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ పర్యవేక్షించిన అనుభవం ఉండటంతో ఆయనకు ఈ స్థానంలో అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. తదనుగుణంగా టీఎస్​పీఎస్సీ పరీక్షలు మరింత మెరుగైన విధానంలో నిర్వహిస్తారని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇప్పటి వరకు టీఎస్​పీఎస్సీ కార్యదర్శిగా ఉన్న అనిత రామచంద్రన్​ను పంచాయతీ రాజ్, రూరల్​ డెవలెప్​మెంట్​(Panchayati Raj, Rural Development) కమిషనర్​గా బదిలీ చేశారు. సమాచార శాఖ కమిషనర్ కె.అశోక్ రెడ్డిని ఉద్యానవన డైరెక్టర్​గా ట్రాన్స్​ఫర్​ చేసింది. సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్​గా ఎం.హన్మంతరావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. బీసీ వెల్ఫేర్​ కమిషనర్​గా బాల మాయదేవిని ప్రభుత్వం నియమించింది.

'మేం అంగీకరించని విషయాలను మినట్స్​లో పొందుపర్చారు - వాటిని సవరించండి'

రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ, TGగా TS - ప్రజల ఆకాంక్షల మేరకే : సీఎం రేవంత్ రెడ్డి

Last Updated : Feb 11, 2024, 10:09 PM IST

ABOUT THE AUTHOR

...view details