ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రయాణికులకు అలర్ట్- ఆ మార్గంలో ఆగస్టు 10 వరకు 24 రైళ్లు రద్దు - Cancellation of 24 Trains in AP - CANCELLATION OF 24 TRAINS IN AP

24 Trains cancelled in Andhra Pradesh : రైళ్ల ట్రాక్ మరమ్మతుల పనుల కారణంగా విజయవాడ - విశాఖపట్నం మధ్య పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ నెల 24 నుంచి ఆగస్టు 10 వరకు 24 రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది.

Cancellation of 24 Trains in AP
Cancellation of 24 Trains in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 9:18 PM IST

24 Trains Cancelled in AP : విజయవాడ - విశాఖపట్నం మధ్య పలు సెక్షన్లలో ట్రాక్ మరమ్మతుల కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ నెల 24 నుంచి ఆగస్టు 10 వరకు 24 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు విజయవాడ డీఆర్​ఎం నరేంద్ర ఎ పాటిల్ తెలిపారు. ప్రమాదాల నివారణ సహా ప్రయాణికులకు మరింత భద్రత కల్పించేందుకు వీటిని చేపట్టినట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా ట్రాక్​ను పటిష్ట పరచడం సహా అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు నరేంద్ర ఎ పాటిల్ పేర్కొన్నారు.

Tains Cancel for Track Maintenance in Vijayawada :ఇందులో భాగంగా విజయవాడ - నిడదవోలు సెక్షన్ మధ్య 4.9 కిలోమీటర్లు, నిడదవోలు - సామర్లకోట మధ్య 4.1 కిలోమీటర్లు, సామర్లకోట -దువ్వాడ మధ్య 5.5 కిలోమీటర్లు కలిపి మొత్తం 14.6 కిలోమీటర్ల పరిధిలో ట్రాక్ రెన్యువల్ పనులు జరుగుతున్నట్లు డీఆర్ఎం నరేంద్ర ఎ పాటిల్ తెలిపారు. వీటితో పాటు స్లీపర్ రెన్యువల్ పనులు చేపట్టినట్లు చెప్పారు. అత్యవసరంగా పనులు చేపట్టడం వల్లే రైళ్లను రద్దు చేయవలసి వచ్చిందన్నారు. ఈ మేరకు ప్రయాణికులు అర్థం చేసుకుని తమకు సహకరించాలని నరేంద్ర ఎ పాటిల్ విజ్ఞప్తి చేశారు.

మరమ్మతులకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని నరేంద్ర ఎ పాటిల్ పేర్కొన్నారు. పనులు పూర్తయ్యే క్రమానికి అనుగుణంగా పలు రైళ్లను తిరిగి పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. విజయవాడ - విశాఖపట్నం మధ్య ప్రస్తుతం ఉన్న డబుల్ లైన్​ను నాలుగు లైన్లుగా మార్చేందుకు ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు పంపినట్లు వివరించారు. అక్కడి నుంచి ఆమోదం రాగానే పనులను ప్రారంభిస్తామని చెప్పారు.

ప్రయాణ సమయం తగ్గుతుంది : మరోవైపు ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థలో రెండు స్టేషన్ల మధ్య నాలుగు చోట్ల సిగ్నల్స్​ను ఏర్పాటు చేయనున్నట్లు నరేంద్ర ఎ పాటిల్ తెలిపారు. తద్వారా ట్రాక్​పై రైళ్లను ఎక్కువ సేపు నిలపకుండా చేసే అవకాశం కలుగుతుందని వివరించారు. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గుతుందని నరేంద్ర ఎ పాటిల్ వెల్లడించారు.

47 రోజులపాటు ఆ మూడు రైళ్లు రద్దు - ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు - trains cancelled

విజయవాడ మీదుగా వెళ్లే 25 రైళ్లు రద్దు- ఆగస్టు 15వరకు వేళల్లో మార్పులు

విజయవాడ, విశాఖపట్నం మధ్య పలు రైళ్లు రద్దు (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details