2018 Group-1 Mains Exam Issue in AP: 2018 గ్రూప్-1 ప్రధాన పరీక్షల రద్దుతో కళంకం ఏర్పడినా జగన్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదు. హాయ్‌ల్యాండ్‌లో తొలివిడత మూల్యాంకనం జరగలేదని ఏపీపీఎస్సీ(APPSC) ఇప్పటికీ బుకాయిస్తోంది. తొలివిడత జవాబుపత్రాల మూల్యాంకనం 2021 డిసెంబరు నుంచి 2022 ఫిబ్రవరి మధ్య హాయ్‌ల్యాండ్‌లో జరిగిందని తెలిపేలా కమిషన్ ద్వారా వివిధ సంస్థలతో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ఎస్బీఐ(SBI) ద్వారా జరిగిన చెల్లింపుల వివరాలు కళ్లెదుటే ఉన్నా, అటు ప్రభుత్వం, ఇటు ఏపీపీఎస్సీ ఇప్పటికీ నోరు విప్పడంలేదు.
భారీగా ఖర్చు: తొలి విడత మూల్యాంకనానికి రూ.కోటి 19 లక్షలు, మలివిడత మూల్యాంకనానికి కోటి 23 లక్షల రూపాయల చొప్పున కమిషన్ ఖర్చుపెట్టింది. పోలీసు భద్రత, వాహనాల వినియోగం, ఉద్యోగుల హాజరు, ఇతర కార్యకలాపాలు హాయ్‌ల్యాండ్ కేంద్రంగా ఎందుకు జరిగాయో చెప్పట్లేదు. జవాబుపత్రాల్లో రెండు రకాల చేతిరాతలు ఉన్నట్లు ఏపీపీఎస్సీయే పేర్కొనడం సంచలనం కలిగిస్తోంది.
గ్రూప్-1లో అక్రమాలు రుజువైనా బుకాయిస్తున్నారు- సవాంగ్ రాజీనామా చేయాలి: పట్టాభి
రెండోసారి మూల్యాంకనంలో 49 వేల ఓఎంఆర్ షీట్లు కావాలని కమిషన్ కార్యదర్శ డేటాటెక్‌కు లేఖ రాశారు. 2021 డిసెంబరు 21 నుంచి మూల్యాంకనం ప్రారంభమైంది. 2022 జనవరి 1న అప్పటి కార్యదర్శి ఫిబ్రవరిలో ఫలితాలు ప్రకటిస్తామన్నారు. మలివిడత మూల్యాంకనం విజయవాడలోని 3 కేంద్రాల్లో 2022 మార్చి 25 నుంచి మే 25 వరకూ జరిగింది. ఏపీపీఎస్సీ కార్యదర్శి హోదాలో డాక్టర్ ఎ.బాబు డేటాటెక్‌కు 2022 మార్చి 9న రాసిన లేఖలో గ్రూప్-1 జవాబుపత్రాల మూల్యాంకనం నిమిత్తం 49వేల ఓఎంఆర్ బార్‌కోడ్ షీట్లు, 2వేల 500 కంట్రోల్ బండిళ్ల స్లిప్పుల తయారీ, ఇతర పనులను అప్పగిస్తుట్లు పేర్కొన్నారు.
అదే ఏడాది మార్చి 25న కమిషన్ అదనపు కార్యదర్శి 3లక్షల 34 వేల 720రూపాయలను డేటాటెక్‌కు ఎస్బీఐ ద్వారా చెల్లించారు. 'వర్క్‌డన్ సర్టిఫికెట్'లోనూ 2018 గ్రూప్-1 జవాబుపత్రాల మాన్యువల్ మూల్యాంకనం అని పేర్కొన్నారు. మూల్యాంకనం దశలవారీగా జరగడంతో జవాబుపత్రాలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌రూమ్‌ను ఉపయోగిస్తారు. వీటి వద్ద, మూల్యాంకన పరిసరాల్లో పోలీసులు భద్రత కల్పించారు.