1800 KG Ganja Seized:అల్లూరి జిల్లా కూనవరంలో పెద్దఎత్తున గంజాయి పట్టుబడింది. వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి కూనవరం మీదుగా గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ 50 లక్షల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. నిందితులు పశ్చిమబెంగాల్‌కు చెందిన ముఠాగా తెలిపారు. పుష్ప సినిమా తరహాలో 25 బస్తాల్లో 40 కిలోల చొప్పున గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎటపాక సీఐ కన్నప్పరాజు తెలిపారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన గంజాయి ముఠా ఒడిశా నుంచి పాత అల్యూమినియం సామగ్రి తెచ్చినట్లు నటించారు. పుష్ప సినిమా తరహాలో 25 బస్తాల్లో 40 కిలోల చొప్పున 1000 కిలోలు గంజాయి రవాణా చేస్తున్నారు. ముందస్తు సమాచారంతో కూనవరంలో పోలీసులు అడ్డుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని, 1000 కిలోల గంజాయిని సీజ్ చేశారు.
చెక్‌పోస్ట్ వద్ద 800 కిలోల గంజాయి స్వాధీనం: విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో పెద్దఎత్తున గంజాయి పట్టుబడింది. కొట్టెక్కి చెక్‌పోస్ట్ నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్న లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి లారీని ట్రేస్ చేసి కొట్టెక్కి చెక్‌పోస్ట్ వద్ద పట్టుకున్నట్లు సీఐ నారాయణరావు తెలిపారు. లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.