14 days Judicial Custody for YouTuber Praneet : సామాజిక మాధ్యమంలో తండ్రి-కుమార్తె వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రణీత్‌ను నాంపల్లిలో పోలీసులు హాజరుపరిచారు. ఈ క్రమంలో నిందితుడికి 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు విధించింది. బుధవారం బెంగళూరులో యూట్యూబర్ ప్రణీత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రణీత్‌పై 67బీ ఐటీ, పోక్సో, 79, 294 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతనితో పాటు మరో ముగ్గురు నిందితులపై కూడా కేసు నమోదు చేశారు. ఏ1గా ప్రణీత్, ఏ2గా నాగేశ్వర్రావు, ఏ3గా యువరాజ్, ఏ4గా సాయి ఆదినారాయణపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. ఇలా ఎవరైనా అసభ్యకరమైన వ్యాఖ్యలు వాడితే చట్ట ప్రకారం శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.
అసలేం జరిగింది :సామాజిక మాధ్యమంలో తండ్రి-కుమార్తె వీడియోపై యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అసభ్యంగా వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో ఈ వీడియోపై మిత్రులతో చిట్‌చాట్ నిర్వహించారు. అతనితో పాటు మరో ముగ్గురు యువకులు కలసి వేర్వేరు చోట్ల కూర్చుని ఒక రీల్‌పై లైవ్‌లో మాట్లాడారు. ఆ రీల్లో ఒక తండ్రి, కుమార్తె ఉంటారు. తండ్రి కూతురుపై అసభ్యకర రీతిలో అర్థం వచ్చేలా సంభాషణలు చేశారు.
ఆ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అది కాస్త తీవ్ర దుమారం రేపింది. సినీనటుడు సాయిదుర్గ తేజ్ ఈ వీడియోపై ఎక్స్ వేదికగా స్పందించారు. దీనిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మరికొంత మందికి ట్యాగ్ చేశారు. వెంటనే దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ యూట్యూబర్, మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశం మేరకు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఈ వీడియోపై మంత్రి సీతక్క, మా అధ్యక్షుడు మంచు విష్ణు, సినీ నటుడు మంచు మనోజ్ తీవ్రంగా స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని తెలిపారు.
యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును పోలీసులు ముమ్మరంగా గాలించారు. అనంతరం అతను బెంగళూరులో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. అక్కడ బెంగళూరులో అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరు పరిచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను గాలించి పట్టుకున్నారు. అనంతరం వారిని నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. అనంతరం 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
తండ్రి-కుమార్తె వీడియోపై అసభ్యంగా మాట్లాడిన యూట్యూబర్ 'ప్రణీత్ హనుమంతు అరెస్ట్' - YouTuber Praneeth Hanumanthu arrest
ఇట్స్ నాట్ ఫన్!! అది నోరా డ్రైనేజా? - యూట్యూబర్‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు - YouTuber P Hanumanthu Controversy