ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పండుగ వేళ ప్రయాణికులకు గుడ్​న్యూస్​- 10 శాతం రాయితీ ఆఫర్​ వీరికి మాత్రమే - Good News for Passengers

10 Percent Discount for Passengers in APSRTC Dolphin Cruise and Amaravathi Buses : పండుగ వేళ ఏపీఎస్‌ఆర్టీసీ డాల్ఫిన్‌ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో ప్రయాణికులకు గుడ్​న్యూస్​ చెప్పింది. హైదరాబాద్​, బెంగళూరు, ఏపీ నుంచి సొంతూర్లకు వెళ్లడానికి 10 శాతం రాయితీతో ఈ బస్సుల్లో టికెట్లు బుక్​ చేసుకోవచ్చని అధికారులు చెప్పారు.

good_news_for_passengers
good_news_for_passengers (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2024, 11:08 AM IST

10 Percent Discount for Passengers in APSRTC Dolphin Cruise and Amaravathi Buses :పండుగ సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున సొతూళ్లకు వెళ్తారు. ఈ సమయంలో బస్సుల్లో రద్దీ మామూలుగా ఉండదు. సాధారణంగా ఈ సమయంలో బస్సుల సంఖ్య పెంచడం, ధరలు పెంపు, తగ్గింపులు సాధారణమే. ఈ క్రమంలోనే 10 శాతం రాయితీ అందిస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ డాల్ఫిన్‌ క్రూయిజ్, అమరావతి బస్సులు ప్రయాణికులకు శుభవార్త చెప్పాయి.

Good News for Passengers :విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు నడుపుతున్న ఏపీఎస్‌ఆర్టీసీ డాల్ఫిన్‌ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు ఆదివారం (అప్‌), శుక్రవారం (డౌన్‌)లను మినహా మిగిలిన రోజుల్లో ఛార్జీలపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా ప్రజా రవాణాధికారి ఎం.వై దానం శుక్రవారం ప్రకటన ద్వారా తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు డాల్ఫిన్‌ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో ఎంజీబీఎస్‌కు ఆదివారం సాధారణ ఛార్జీ రూ. 770, మిగిలిన రోజుల్లో రూ. 700, తదుపరి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆదివారం సాధారణ ఛార్జీ రూ. 830 ఉండగా మిగిలిన రోజుల్లో రూ. 750గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క‌స‌ర‌త్తు - సమగ్ర విధానాన్ని అమలు చేయాలన్న సీఎం - CM Chandrababu Review on RTC

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చేటప్పుడు శుక్రవారం సాధారణ ఛార్జీ, మిగిలిన రోజుల్లో రాయితీ ఛార్జీ వసూలు చేస్తారు. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వెన్నెల స్లీపర్‌ ఏసీ బస్సుల్లో ఆదివారం మెజిస్టెక్‌ బస్టేషన్‌ వరకు సాధారణ ఛార్జీ రూ. 2170, మిగిలిన రోజుల్లో 1970, ఆపై ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆదివారం రూ. 2210, మిగిలిన రోజుల్లో రూ. 2010, అమరావతి మల్టీ యాక్సిల్‌ బస్సుల్లో ఆదివారం మెజిస్టిక్‌ బస్టేషన్‌ వరకు సాధారణ ఛార్జీ రూ.1870, మిగిలిన రోజుల్లో 1700, ఆపై ప్రాంతాలకు ఆదివారం సాధారణ ఛార్జీ 1930, మిగిలిన రోజుల్లో రూ. 1750 గా రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

3,500 మంది డ్రైవర్లతో 2 వేల బస్సుల్లో - మహిళలకు ఉచిత ప్రయాణం! - Free Bus Scheme in AP

ABOUT THE AUTHOR

...view details