Yashasvi Jaiswal Emotional Video:భారత్- ఇంగ్లాండ్ రెండో టెస్టులో తొలి రోజు టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. స్వదేశంలో టెస్టుల్లో తొలి అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. విశాఖపట్టణం పిచ్‌పై పరుగులు చేయడానికి టీమ్ఇండియా బ్యాటర్లు కష్టపడుతుంటే, జైశ్వాల్ మాత్రం క్రీజులో ఈజీగా స్కోర్ చేశాడు. తొలి రోజు 257 బంతులు ఎదుర్కొన్న యంగ్ బ్యాటర్ 179 పరుగులు చేశాడు. అందులో 17 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. దీంతో మ్యాచ్‌లో తొలి రోజు హీరోగా నిలిచాడు. అయితే జైశ్వాల్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జైశ్వాల్ ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడుతూ లైఫ్‌లో తను పడిన ఇబ్బందుల గురించి వీడియోలో చెప్పాడు.
'నేను కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఓ సమయంలో ఒంటరిగా ఫీలయ్యా. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఓ లోకల్ మ్యాచ్‌లో ఆడే ఛాన్స్ వచ్చింది. అందులో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే రూ.200, రూ.300 వచ్చేవి. ఒక్కోసారి బ్యాట్ కూడా లేదు. వేరే వాళ్ల కిట్ తీసుకుని ఆడాల్సి వచ్చేది. ఏదైనా సాధించాలని మైండ్‌లో ఫిక్సైతే అస్సలు వదులొద్దు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దానికోసం ప్రయత్నించాలి. ఫలితం గురించి ఆలోచించకూడదు. అది మన చేతుల్లో లేదు. ప్రజెంట్ గురించే ఆలోచించాలి' అని జైశ్వాల్ తన లైఫ్‌లో ఎదుర్కొన్న విషయాల గురించి చెప్పాడు. అయితే ఇది పాత వీడియో. జైశ్వాల్ తాజా ఇన్నింగ్స్‌తో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.