Yashasvi Jaiswal Double Century:టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ అంతర్జాతీయ కెరీర్లో తొలి డబుల్ సెంచరీ (209) సాధించాడు. ఇంగ్లాండ్‌తో విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న టెస్టులో ఓవర్‌నైట్ స్కోర్ 179తో రెండో రోజు ఆట ప్రారంభించిన జైశ్వాల్ 200 మార్క్ అందుకున్నాడు. దీంతో టెస్టుల్లో ద్విశతకం సాధించిన టీమ్ఇండియా ప్లేయర్లలో మూడో అతిపిన్న వయస్కుడిగా జైశ్వాల్ రికార్డు కొట్టాడు. అలాగే కెరీర్లో ఆడుతున్న 10వ ఇన్నింగ్స్‌లోనే జైశ్వాల్ ఆ ఫీట్ అందుకున్నాడు. ఇక అండర్సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన జైశ్వాల్ క్యాచౌట్‌గా వెనుదిరిగాడు.
భారత్ తరఫున టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన ఆతిపిన్న వయస్కులు
- వినోద్ కాంబ్లీ (224)- 21 ఏళ్ల 35 రోజులు- 1993
- వినోద్ కాంబ్లీ (227)- 21 ఏళ్ల 55 రోజులు- 1993
- సునిల్ గావస్కర్ (201*)- 21 ఏళ్ల 283 రోజులు- 1971
- యశస్వి జైశ్వాల్ (209)- 22 ఏళ్ల 37 రోజులు- 2024
టీమ్ఇండియా తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 200 అందుకున్న బ్యాటర్లు
- కరున్ నాయర్- 3 ఇన్నింగ్స్‌లు
- వినోద్ కాంబ్లీ- 4 ఇన్నింగ్స్‌లు
- సునిల్ గావస్కర్- 8 ఇన్నింగ్స్‌లు
- మయంక్ అగర్వాల్- 8 ఇన్నింగ్స్‌లు
- ఛెతేశ్వర్ పుజారా- 9 ఇన్నింగ్స్‌లు
- యశస్వి జైశ్వాల్- 10 ఇన్నింగ్స్‌లు