Virat Kohli Son:టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ- భార్య అనుష్క శర్మ మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఫిబ్రవరి 15న అనుష్క పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా ఈ విషయాన్ని విరాట్ మంగళవారం స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. బాబుకు 'అకాయ్' (Akaay) అనే పేరు పెట్టినట్లు తెలిపాడు.'మేం ఫిబ్రవరి 15న మా బేబి బాయ్ అకాయ్ (వామికకు తమ్ముడు)ను ఈ ప్రపంచంలోకి స్వాగతించాం. మా జీవితంలో ఇవి మధురమైన క్షణాలు. మాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి' అని విరాట్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. దీంతో సెలబ్రిటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విరాట్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక 2017 ఇటలీలో విరాట్- అనుష్క వివాహం గ్రాండ్‌గా జరిగింది. వీరికి 2021 జనవరి 11న వామిక అనే కుమార్తె జన్మించింది.
అప్పట్నుంచి ప్రచారం: 2023 వరల్డ్‌కప్‌లో సమయంలో విరాట్- అనుష్క బెంగళూరులోని ఓ హోటల్‌కు డిన్నర్‌కు వెళ్లారు. అప్పుడు అనుష్క ప్రెగ్నెంట్ అని, బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుందని పలు కథనాలు వచ్చాయి. అప్పటినుంచి విరాట్- అనుష్క రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారన్న వార్తలు ప్రారంభమయ్యాయి. ఇక రీసెంట్గా ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ నుంచి విరాట్ తప్పుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.