Virat Kohli Instagram Posts : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరంగా ఉన్నారు. ఇటీవలే ఆయన సతీమణి అనుష్క 'అకాయ్' అనే పండంటి బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తన ఫ్యాన్స్ కోసం నెట్టింట ఈ సంతోషకరమైన వార్తను తెలియజేశారు. అయితే ఈ ఆనందంలో ఉన్న విరాట్, తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్‌తో పాటు తాను అప్లోడ్ చేసిన మరో ఆరు పోస్ట్‌లకుగానూ ప్రతి దానికి దాదాపు 10 మిలియన్లకు పైగా లైక్స్ అందుకున్నాడు. ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా 6 పోస్ట్‌లకు 10 మిలియన్లకు పైగా లైక్‌లు పొందిన తొలి భారతీయుడిగా కోహ్లీ చరిత్రకెక్కాడు.
బాబు పేరు 'అకాయ్'
Virat Kohli Son :అకాయ్ పుట్టిన ఆనందాన్ని విరాట్ తన ఫ్యాన్స్‌తో ఓ స్వీట్ పోస్ట్ ద్వారా పంచుకున్నాడు. అందులో ఆ చిన్నారి పేరును రివీల్ చేస్తూనే తనను ఆశీర్వదించమంటూ కోరాడు.
'మేం ఫిబ్రవరి 15న మా బేబి బాయ్ అకాయ్ (వామికకు తమ్ముడు)ను ఈ ప్రపంచంలోకి స్వాగతించాం. మా జీవితంలో ఇవి మధురమైన క్షణాలు. మాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి' అని విరాట్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. దీంతో సెలబ్రిటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విరాట్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక 2017 ఇటలీలో విరాట్- అనుష్క వివాహం గ్రాండ్‌గా జరిగింది. వీరికి 2021 జనవరి 11న వామిక అనే కుమార్తె జన్మించింది.