Virat Kohli 9000 Test Runs :టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్లో మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో 9 వేల పరుగులు పూర్తి చేశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో 53 వ్యక్తిగత పరుగుల వద్ద విరాట్ ఈ మైలురాయి అందుకున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 9 వేలకుపైగా పరుగుల చేసిన టీమ్ఇండియా నాలుగో బ్యాటర్‌గా రికార్డు కొట్టాడు. ఈ లిస్ట్‌లో సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గావస్కర్, విరాట్ కంటే ముందున్నారు.
2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన విరాట్ ఇప్పటి వరకు 116 మ్యాచ్‌ల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ మాదిరే సుదీర్ఘ ఫార్మాట్లోనూ విరాట్ తనదైన ముద్ర వేశాడు. ఇప్పటివరకు 197 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ 48.99 సగటున 9015* పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అందులో ఏడుసార్లు డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.
టెస్టుల్లో అత్యధిక పరుగులు (భారత బ్యాటర్లు)
- సచిన్ తెందూల్కర్- 15921 పరుగులు
- రాహుల్ ద్రవిడ్- 13265 పరుగులు
- సునీల్ గావస్కర్- 10122 పరుగులు
- విరాట్ కోహ్లీ- 9015* పరుగులు
- వివిఎస్ లక్ష్మణ్- 8781 పరుగులు