Virat Kohli Records :టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్లో మరో అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఇప్పటివరకు విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి స్వదేశంలో 12 వేల పరుగులు పూర్తి చేశాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్టులో రెండో ఇన్నింగ్స్లో 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కంటే ముందు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ఒక్కడే ఉన్నాడు.
కింగ్ అదుర్స్
భారత జట్టు తరఫున స్వదేశంలో 219 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 58.84 సగటుతో కోహ్లీ 12,008 పరుగులు చేశాడు. ఇందులో 38 సెంచరీలు, 59 అర్ధ శతకాలు ఉన్నాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ స్వదేశంలో 258 మ్యాచ్ ల్లో 50.32 సగటుతో 14,192 పరుగులు చేశాడు. ఇందులో 42 సెంచరీలు, 70 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా, విరాట్ స్వదేశంలో మరో 2 వేల పరుగులు బాదితే సచిన్ రికార్డును అధిగమించవచ్చు.
స్వదేశంలో అత్యధిక పరుగులు బాదిన భారత బ్యాటర్లు
ప్లేయర్ | కెరీర్ | మ్యాచ్లు | పరుగులు | సెంచరీలు |
సచిన్ తెందూల్కర్ | 1990 - 2013 | 258 | 14192 | 42 |
విరాట్ కోహ్లీ | 2008 - 2024* | 219 | 12004 | 38 |
రాహుల్ ద్రవిడ్ | 1996 - 2011 | 167 | 9004 | 21 |
రోహిత్ శర్మ | 2007 - 2024* | 179 | 8690 | 27 |
వీరేంద్ర సెహ్వాగ్ | 1999 - 2013 | 142 | 7691 | 18 |
ఎమ్ఎస్ ధోనీ | 2005 - 2019 | 202 | 7401 | 12 |