Vinod Kambli Reacts on His Health Condition : కొంతకాలంగా భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ (52) ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే శనివారం రాత్రి అతడి ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో ఠానెలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందిస్తోన్న వైద్యులు కాంబ్లీ మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తన హెల్త్ కండిషన్‌పై నేరుగా మాట్లాడాడు. ఇక్కడి డాక్టర్ల వల్ల బతికి ఉన్నానని ఆస్పత్రి బెడ్‌పై నుంచి స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
"నేను ప్రస్తుతం బెటర్‌గానే ఉన్నాను. ఈ క్రికెట్‌ను నేను అస్సలు విడిచి పెట్టను. ఎందుకంటే నేను ఎన్నో సెంచరీలు, డబుల్ సెంచరీలు చేశాను. మా ఫ్యామిలీలో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్ ఉన్నారు. సచిన్ తెందుల్కర్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో ఉన్నందుకు ఎంతో రుణపడి ఉన్నాను." అని వినోద్ కాంబ్లీ అన్నాడు.