Star Cricketer To Taxi Driver : క్రికెట్ ఈ క్రీడ పేరు తెలియని వారు చాలా తక్కువ. ఈ ఆటకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాదు, ఈ కాలంలో ఇదొక కమర్షియల్ గేమ్. సంపన్న క్రీడ. క్రికెటర్లు ఈ ఆట ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. తద్వార విలాసవంతమైన జీవితాలు గడుపుతారు. ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ వల్ల వెలుగులోకి వచ్చి, స్టార్లు అయిన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. వారు సైతం ఇప్పుడు మంచి స్థాయిలో ఉండి స్థిరపడ్డారు.
అలాంటి క్రికెట్ రంగంలో అతను ఒకప్పుడు స్టార్ బౌలర్. ఒక పేరున్న జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు మూడు ఐసీసీ వన్డే ప్రపంచ్ కప్పుల్లోనూ పాల్గొన్నాడు. కానీ ప్రస్తుతం ఆయన ఒక సామాన్యమైన జీవితం గడుపుతున్నాడు. ఇళ్లు గడవడానికి డ్రైవర్ అవతారమెత్తి, టాక్సీ నడుపుతున్నాడు. ఇండియాలో ఒక క్రికెటర్ కు ఇలాంటి పరిస్థితి వస్తే ఆశ్చర్యకరమైన విషయమే కానీ, న్యూజిలాండ్‌లో కాదు. ఇంతకీ అతడెవరో కాదు ఆ దేశపు మాజీ ఆటగాడు ఎవెన్ చాట్ ఫీల్డ్.
ఎవెన్ చాట్ ఫీల్డ్‌కు ప్రస్తుతం 70 ఏళ్లు దాటాయి. సాధారణ టాక్సీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఒక స్టేడియంలోని బేసిన్ రిజర్వ్ పెవిలియన్‌కు ఒక లెజెండరీ క్రికెటర్ పేరు పెడితే ఎవెన్ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. రెండు గంటల పాటు అక్కడ ఉండి ఆ తర్వాత మళ్లీ డ్రైవింగ్ చేయడానికి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిస్తే అతడి అభిమానులు, సహచర క్రికెటర్లు ఆందోళన చెందడం సహజమే. వేరే దేశాల్లో అయితే ఒకప్పుడు లెజెండరీ క్రికెటర్, ఇప్పుడు టాక్సీ డ్రైవర్ అంటూ కథనాలు రాసి, మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసే వాళ్లు. కానీ, న్యూజిలాంట్ దేశంలో అయితే ఇలాంటివి సాధారణమే.