తెలంగాణ

telangana

ETV Bharat / sports

యువీకి అరుదైన గౌరవం- T20 వరల్డ్​కప్​ అంబాసిడర్​గా ఎంపిక - 2024 T20 World Cup - 2024 T20 WORLD CUP

Yuvraj Singh T20 World Cup: టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ యువరాజ్​ సింగ్​కు అరుదైన గౌరవం దక్కింది. అతడు జూన్​లో జరగనున్న ప్రపంచకప్​నకు అంబాసిడర్​గా ఎంపికయ్యాడు.

Yuvraj Singh
Yuvraj Singh

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 4:14 PM IST

Updated : Apr 26, 2024, 5:20 PM IST

Yuvraj Singh T20 World Cup:టీమ్ఇండియా మాజీ క్రికెటర్​కు అరుదైన గౌరవం దక్కింది. అతడు 2024 టీ20 వరల్డ్​కప్ అంబాసిడర్​గా ఎంపికయ్యాడు. 2007 వరల్డ్​కప్​లో భాగంగా 6 బంతుల్లో 6 సిక్స్​లు బాదిన యువీని పొట్టి ప్రపంచకప్​కు అంబాసిడర్​గా ఐసీసీ నియమించింది. ఈ విషయాన్ని ఐసీసీ సోషల్ మీడియాలో గురువారం అధికారికంగా ప్రకటించింది.

ఈ అంబాసిడర్ పాత్రలో భాగంగా యువీ, జూన్ 9న జరగనున్న భారత్- పాకిస్థాన్​ మ్యాచ్​తోపాటు వరల్డ్​కప్ టోర్నీలో ప్రమోషన్ ఈవెంట్లు, ఆయా కార్యక్రమాల బాధ్యతలు చూడనున్నాడు. దీనిపై యువరాజ్ స్పందించాడు. 'ఒకే ఓవర్లో 6 సిక్స్​లు బాదడం సహా టీ20 వరల్డ్​కప్ ద్వారానే క్రికెట్​లో నాకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. రానున్న వరల్డ్​కప్​లో భాగం కాబోతున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాను' అని యువీ అన్నాడు. కాగా, ఐసీసీ వెస్టిండీస్ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్, ఒలింపిక్ మెడల్ విన్నర్ ఉసెన్ బోల్ట్​ను రీసెంట్​గా అంబాసిడర్​లుగా ఎంపిక చేసింది. తాజాగా యువీ కూడా ఈ లిస్ట్​లో చేరిపోయాడు. దీంతో ఈ ముగ్గురు 2024 వరల్డ్​కప్ అంబాసిడర్​లుగా వ్యవహరించనున్నారు.

కాగా, జూన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ సమరం ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఇప్పటికే టోర్నీకి సంబంధించిన పనులను నిర్వాహకులు దాదాపు పూర్తి చేశారు. ఇక ఈ టోర్నమెంట్​లో 20 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీ పడతాయి. ఈ నేపథ్యంలో భారత్ గ్రుప్ -Aలో ఉంది. ఈ గ్రూప్​లో భారత్​తోపాటు పాకిస్థాన్, ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడా ఉన్నాయి. ఇక క్రికెట్​లోనే హై వోల్టేజ్ మ్యాచ్ భారత్- పాకిస్థాన్ పోరుకు న్యూయార్క్ వేదిక కానుంది.

India World Cup Promo video: ప్రముఖ బ్రాడ్​కాస్టింగ్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ ఇటీవల టీమ్ఇండియా కోసం స్పెషల్ ప్రోమో వీడియో రిలీజ్ చేసింది. 'రోహిత్ సేన టీ20 వరల్డ్​కప్​నకు సిద్ధమవుతోంది. వాళ్ల యాక్షన్ చూడడానికి మీరు సిద్ధమా?' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక వీడియో బ్యాక్​గ్రౌండ్​లో భారత జాతీయ గేయం 'వందేమాతం' లిరిక్స్ ప్లే చేశారు. ఈ లిరిక్స్ వీడియోలో హైలైట్​గా నిలిచాయి.

'వరల్డ్​కప్​ టీమ్​లో ప్లేస్ దక్కకపోతే ఆ పని చేస్తా'- గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! - 2024 T20 World Cup

'ఇండియా' రెడీ మీరు రెడీనా?- T20 వరల్డ్​కప్ ప్రోమో వీడియో - 2024 T20 World Cup

Last Updated : Apr 26, 2024, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details