T20 Worldcup 2024 Super 8 :టీమిండియా తడబడుతున్నా విజయం గురి తప్పనివ్వడం లేదు. గ్రూప్ దశ దాటి సూపర్-8లో రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన రోహిత్ సేన శనివారం బంగ్లాదేశ్‌ను ఢీకొట్టనుంది. ఆంటిగ్వా పిచ్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్‌లో భారత జట్టే ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. కానీ, ఇప్పటికే సూపర్-8 మ్యాచ్‌లలో తొలి మ్యాచ్ ఆడేసిన బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది. కానీ, భారత జట్టుపైనే చాలా సార్లే గెలిచింది. పైగా ఆ జట్టుకిది చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. అందుకే టీమిండియా ఇంకాస్త ఫోకస్ పెంచాల్సి ఉంటుంది.
బంగ్లా బలం :టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో బంగ్లాదేశ్ ఇప్పటివరకూ బాగానే రాణించింది. ప్రధానంగా ఆ జట్టు బౌలింగ్ విభాగాలు అయిన తంజిద్ హసన్, ముస్తాఫిజుర్, తస్కిన్ లతో పేస్ విభాగం, మెహిదీ హసన్, రిషాద్, షకీబ్ లతో స్పిన్ విభాగం మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. బ్యాటింగ్‌లో లోపాలున్నా నెట్టుకొస్తున్నారు. ఓపెనర్లు తంజిద్, లిటన్ దాస్‌లతో పాటు కెప్టెన్ నజ్ముల్ శాంటో ప్రదర్శనలో నిలకడ కనిపించడం లేదు. మిడిలార్డర్లో హృదయ్, మహ్మదుల్లా, షకీబ్ పర్వాలేదనిపిస్తున్నారు.
టాపార్డర్లో ట్రబుల్ :టీమిండియా టాపార్డర్లో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ తర్వాత అదే ఉత్సాహంతో అడుగుపెట్టిన విరాట్ ఫామ్ లేమితో బాధపడుతూ గ్రూప్ దశలో మొత్తం మూడూ మ్యాచ్‌లకు కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు. సూపర్-8లో తొలి మ్యాచ్ అయిన అఫ్గానిస్థాన్ జట్టుపై కేవలం 24పరుగులు మాత్రమే నమోదు చేశాడు. మిడిలార్డర్లోనూ శివమ్ దూబె అంతగా రాణించడం లేదు. అందుకే ఓపెనర్ గా జైస్వాల్‌ను ఆడించి విరాట్‌ను తనకు బాగా అలవాటున్న మిడిలార్డర్‌కు మారిస్తే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బంగ్లాదేశ్ మాదిరిగానే టీమిండియాలోనూ బౌలింగ్‌లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. పేసర్లు బుమ్రా, అర్షదీప్ నిలకడగా రాణిస్తుండగా అక్షర్, జడేజాలకు తోడుగా కుల్దీప్ స్పిన్ బలాన్ని పెంచాడు.
తుది జట్లు (అంచనా) :
టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శివమ్ దూబె/యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రిత్ బుమ్రా
బంగ్లాదేశ్:
తంజిద్, లిటన్, నజ్ముల్ శాంటో (కెప్టెన్), తౌహిద్, షకీబ్, మహ్మదుల్లా, మెహదీ హసన్, రిషాద్, తస్కిన్, ముస్తాఫిజుర్, తంజిమ్ హసన్